తెలుగులో న‌టించేందుకు రెడీ: కాజోల్‌

Kajol ready to act in Telugu
Wednesday, April 24, 2019 - 23:30

డిడిఎల్‌జే సినిమాతో దేశ‌మంతా అభిమానుల‌ను సంపాదించుకొంది కాజోల్‌. ఈ 40 ప్ల‌స్ సుంద‌రి రీసెంట్‌గా ధ‌నుష్ నిర్మించిన‌ త‌మిళ సినిమాలో కీల‌క పాత్ర పోషించింది. ఆమె ఇప్ప‌టి వ‌ర‌కు ద‌క్షిణాదిలో న‌టించిన చిత్రాల‌న్నీ త‌మిళ‌భాష‌కి చెందిన‌వే. తెలుగులో న‌టించ‌లేదు. ఇటీవ‌ల హైద‌రాబాద్‌కి వ‌చ్చిన కాజోల్‌ని ఇదే విష‌యం అడిగితే... ఇపుడు తెలుగులో నటించేందుకు రెడీ అని చెప్పింది. 

మంచి సినిమా, మంచి పాత్ర వ‌స్తే త‌ప్ప‌కుండా చేస్తాన‌ని స‌మాధానం ఇచ్చింది కాజోల్‌. ఆమె భ‌ర్త అజ‌య్ దేవ‌గ‌న్ రాజ‌మౌళి తీస్తున్న ఆర్‌.ఆర్‌.ఆర్ సినిమాలో ఒక కీల‌క పాత్ర పోషించ‌నున్నాడు. ఆయ‌న తెలుగులో ఎంట్రీ ఇస్తున్నాడు. సో భ‌ర్త‌తో పాటే కాజోల్ కూడా తెలుగులో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీన‌ట‌.

మ‌రి తెలుగు ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు రెడీనా కాజోల్‌కి మంచి పాత్ర ఇచ్చేందుకు?