బుల్లితెరపై కూడా చేతులెత్తేసిన కల్కి

Kalki fails on TV as well
Thursday, October 3, 2019 - 21:30

రాజశేఖర్ ను మోస్ట్ స్టయిలిష్ గా చూపించిన సినిమా
అతడికి ఓ సరికొత్త స్క్రీన్ టైటిల్ ను ఇచ్చిన సినిమా
టెక్నికల్ గా అందరితో వావ్ అనిపించిన సినిమా

అదే రాజశేఖర్-ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో వచ్చిన కల్కి సినిమా. థియేట్రికల్ గా పెద్దగా ఆకట్టుకోని ఈ సినిమా బుల్లితెరపై మాత్రం విశ్వరూపం చూపిస్తుందని అంతా ఎక్స్ పెక్ట్ చేశారు. ఈ మూవీ కంటెంట్ టీవీకి భలేగా సెట్ అవుతుందంటూ అప్పట్లో కొందరు విశ్లేషణలు కూడా ఇచ్చారు. కట్ చేస్తే, రేటింగ్స్ లో కల్కి సినిమా చేతులెత్తేసింది. కేవలం 5 టీఆర్పీతో సర్దుకోవాల్సి వచ్చింది. దీంతో బుల్లితెరపై కూడా ఇది ఫ్లాప్ అనిపించుకుంది.

గరుడవేగ లాంటి సూపర్ హిట్ తర్వాత వచ్చిన సినిమా కావడంతో ఈ సినిమాను థియేట్రికల్ గానే కాకుండా, నాన్-థియేట్రికల్ గా కూడా భారీ రేట్లకు అమ్మారు. అలా భారీ కాంపిటిషన్ మధ్య స్టార్ మా ఛానెల్ దాదాపు నాలుగున్నర కోట్లు పెట్టి ఈ సినిమా శాటిలైట్ రైట్స్ దక్కించుకుంది. అటుఇటుగా 10 టీఆర్పీ వస్తుందని అంచనా వేసింది. కానీ కల్కి బుల్లితెరపై కూడా బోల్తాకొట్టింది. ఆశ్చర్యకరంగా హైదరాబాద్ జనాలు కూడా కల్కి సినిమాను పట్టించుకోలేదు. భాగ్యనగరంలో దీనికి కేవలం 6 టీఆర్పీ వచ్చింది.

కల్కి సినిమా కంటే లారెన్స్ స్వీయదర్శకత్వంలో నటించిన కాంచన-3 బెస్ట్ అనిపించుకుంది. వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ లో భాగంగా దుమ్ముదులిపిన ఈ సినిమా.. రెండో ఎయిరింగ్ లో కూడా 7 టీఆర్పీ తెచ్చుకొని ది బెస్ట్ అనిపించుకుంది.