క‌ల్యాణ్‌రామ్‌, మెహ్రీన్ మొద‌లెట్టారుగా

Kalyan Ram and Mehreen film launched
Thursday, June 20, 2019 - 15:45

ఆడియో కంపెనీ ఆదిత్య మ్యూజిక్ నిర్మాణ రంగంలో తొలిసారి అడుగుపెట్టింది. శ్రీదేవీ మూవీస్ అధినేత శివ‌లెంక కృష్ణ ప్ర‌సాద్ స‌మ‌ర్ప‌ణ‌లో ఆదిత్య మ్యూజిక్ సంస్థ త‌మ తొలి చిత్రంగా క‌ల్యాణ్ రామ్ హీరోగా మొద‌లుపెట్టింది. శ‌త‌మానం భ‌వ‌తి చిత్రం తీసిన‌ స‌తీశ్ వేగేశ్న ద‌ర్శ‌క‌త్వంలో  ఈమూవీ గురువారం లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. ఉమేశ్ గుప్తా నిర్మాత‌.

మెహ్రీన్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. 118 అనే సినిమాతో క‌ల్యాణ్‌రామ్ ఈ ఏడాది డీసెంట్ స‌క్సెస్ అందుకున్నాడు. ఇపుడు ఈ సినిమాతో ఫ్యామిలీ ఆడియెన్స్‌ని టార్గెట్ చేశాడు.

``జూలై 24 నుండి సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. నిర‌వ‌ధికంగా హైద‌రాబాద్‌, రాజ‌మండ్రి ప‌రిస‌ర ప్రాంతాలు, ఊటీ లో చిత్రీక‌ర‌ణ చేస్తాం. స‌తీశ్ వేగేశ్న‌గారు అద్భుత‌మైన ఎమోష‌న్స్‌తో సినిమా క‌థ‌ను సిద్ధం చేశారు. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను మెప్పించే చిత్రాన్ని నిర్మిస్తాం` అని నిర్మాత‌లు తెలిపారు.