2 రోజుల్లో 3 కోట్లు పొందింది: దిల్ రాజు

Kalyan Ram's 118 collects Rs 3 cr in two days
Sunday, March 3, 2019 - 16:45

నందమూరి కల్యాణ్‌ రామ్‌ కథానాయకుడిగా నటించిన '118' మార్చి 1న విడుదలైంది. మంచి టాక్ సంపాదించుకొంది. ఈ సినిమాని దిల్‌రాజు తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేశారు. 

"పటాస్ మూవీ తరువాత క‌ల్యాణ్‌రామ్ న‌టించిన మూవీని మేం రిలీజ్ చేసిన మూవీ ఇది. డిఫ్రెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ  సినిమాకు ఆడియన్స్ తో పాటు పాజిటివ్ రివ్యూస్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి థాంక్స్. కళ్యాణ్ రామ్ కెరీర్ లో ఒక మంచి థ్రిల్లింగ్ సినిమాగా 118 నిలిచింది. గుహన్ నాకు 20 ఏళ్లుగా పరిచయం. ఖుషి సినిమాకు అసిస్టెంట్ కెమెరామెన్. ఆ   తరువాత మా బ్యానర్ లో చాలా సినిమాలకు డి ఓ పి గా పనిచేశారు ఇప్పుడు దర్శకుడిగా తనను తాను ప్రూవ్ చేసుకున్నారు.  మహేష్ కోనేరు ఈ సినిమాతో సక్సెస్ సాధించడం మా  సొంత సినిమా సక్సస్ అయినంత హ్యాపీ గా ఉంది ఈ సందర్భంగా వారిద్దరిని అభినందిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో రెండురోజులు గాను 3 కోట్ల షేర్ వచ్చింది.ఇలాగే ఇంకా మంచి కలెక్షన్లు సాధించాలి. ప్రతి ఒక్కరూ సినిమా చూడండి" అన్నారు దిల్ాజు.

"దిల్ రాజు గారు చెప్పినట్టు మా ఇద్దరిది ఇరవై ఏళ్ళ అనుబంధం. ఆయన నాకు గాడ్ బ్రదర్ లాంటి వారు . ఆయన 118 మంచి సినిమా అని చెప్పడం చాలా సంతోషంగా ఉంది "అన్నారు కేవీ గుహ‌న్‌.

నందమూరి కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ - " పటాస్ రిలీజ్ అయ్యి నాలుగు సంవత్సరాలు అయింది. అప్పుడు కూడా దిల్ రాజు గారు, శిరీష్  గారు మా సినిమా చూసి మా సినిమాను డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. మా ప్రయత్నాన్ని మీరందరు అభినందిచారు. మళ్ళినాలుగు ఏళ్లతరువాత ఈ 118 సినిమా చూడడం జరిగింది. చాలా ఎక్సయిట్ అయ్యి ఈ సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లో వారి సంస్థ ద్వారా విడుదల చేయడం జరిగింది. అలా మళ్లీ విజయం సాధించడం చాలా సంతోషంగా ఉంది. అలాగే  మా నిర్మాత మహేష్ గారికి సపోర్ట్ గా  ఉన్న శిరీష్ గారికి థాంక్స్. ప్రతి ఒక్కరూ సినిమా చూడండి అన్నారు. 

"118 సినిమా విడుదలై అద్భుతమైన టాక్ తో మంచి రెవిన్యూ తో ప్రదర్శించబడుతోంది. ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. ఈ సినిమాకు మాకు ఫస్ట్ ధైర్యాన్ని ఇచ్చిన తారక్ కి థాంక్స్. ఆ తరువాత అంతటి ధైర్యాన్ని దిల్ రాజు గారు శిరీష్ గారు ఇవ్వడం జరిగింది. వారి నమ్మకం తో సినిమా విజయవంతంగా రన్ అవుతోంది. ఈ శివరాత్రికి మీరందరు కుటుంబసమేతంగా వెళ్ళి సినిమా చూడాలి అని కోరుకుంటున్నారు," అన్నారు నిర్మాత మ‌హేష్ కోనేరు.