క‌మ‌ల్‌హాస‌న్‌పై కేసు న‌మోదు

Kamal Haasan booked for Hindu terrorist remark
Tuesday, May 14, 2019 - 22:30

దేశంలో మొట్టమొద‌టి టెర్ర‌రిస్ట్ హిందూవే అంటూ క‌మ‌ల్‌హాస‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌పై దుమారం రేగుతూనే ఉంది. తాజాగా ఆయ‌న‌పై త‌మిళ‌నాడు పోలీసులు కేసు న‌మోదు చేశారు. హిందువుల మనోభావాలను కించపరిచారంటూ  పోలీసులకు అందిన‌ ఫిర్యాదు మేరకు కమల్‌ హాసన్‌పై 153ఏ, 295ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. త‌మిళ‌నాడులో జ‌రుగుతున్న అసెంబ్లీ ఉప ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా క‌మ‌ల్ హాస‌న్ చేసిన ఈ వ్యాఖ్య‌ల‌ను ప‌లు రాజ‌కీయ పార్టీల నేత‌లు త‌ప్పు ప‌ట్టారు.

త‌మిళ‌నాడులోని అర‌వకురిచి అసెంబ్లీ సీటుకి ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. ఆయ‌న పార్టీ మక్కల్‌ నీది మయ్యం అభ్య‌ర్థి త‌ర‌ఫున ప్ర‌చారం నిర్వ‌హించాడు క‌మ‌ల్‌. మైనార్టీ వ‌ర్గానికి చెందిన ఓట‌ర్లు అధికంగా ఉండే నియోజ‌క‌వ‌ర్గం కాబ‌ట్టే క‌మ‌ల్ రెచ్చ‌గొట్టే విధంగా ఈ వ్యాఖ్య‌లు చేశాడ‌నేది ఆరోప‌ణ‌. "స్వ‌తంత్ర భార‌తంలో మొట్ట మొద‌టి తీవ్ర‌వాది ఒక హిందూ. అత‌ని పేరు నాథురామ్ గాడ్సే," అంటూ క‌మ‌ల్ అన్నాడు. గాడ్సే..మ‌హాత్మ గాంధీని కాల్చి చంపాడు.

ఐతే ఒక వ్య‌క్తి చేసిన దారుణమైన చ‌ర్య‌కి, టెర్ర‌రిజానికి తేడా తెలియ‌దా అంటూ క‌మ‌ల్‌ని తిట్టి పోస్తున్నారు అంతా.