కంగ‌న తీసిన సీన్లు ఇవే

Kangana and Krish controversy
Saturday, January 26, 2019 - 23:00

కంగ‌న ర‌నౌత్ న‌టించిన మ‌ణిక‌ర్ణిక సినిమా విడుద‌లైంది. ఈ సినిమాకి కొంద‌రు విమ‌ర్శ‌కులు మంచి రేటింగ్ ఇచ్చారు. మ‌రికొంద‌రు బ్యాడ్‌గా ఉంది డైర‌క్ష‌న్ అన్నారు. ఐతే న‌టిగా మాత్రం ఆమెకి అంద‌రూ డిస్టింక్ష‌న్ మార్కులు ఇచ్చారు. వ‌ర్మ‌లాంటి ద‌ర్శ‌కులు కూడా ఆమె న‌ట‌న చూసి గొప్ప‌గా పొగుడుతూ ట్వీట్ చేశారు. ఐతే ఈ సినిమాకి ఆమె ద‌ర్శ‌కురాలిగా కూడా పేరు వేసుకొంది. క్రిష్ తీసిన ఈ సినిమాని 70 శాతం రీషూట్ చేశాన‌ని రిలీజ్‌కి ముందు కంగ‌నా చెప్పుకొంది. మ‌రి నిజంగా క్రిష్ తీసిన సీన్లు సినిమాలో ఏమీ లేవా?

మ‌ణిక‌ర్ణిక సినిమాని క్రిష్ 90 శాతం తీసిన త‌ర్వాత సినిమా నుంచి త‌ప్పుకున్నాడు. సోనూ సూద్ క్యార‌క్ట‌ర్ విష‌యంలో కంగ‌న‌కి, క్రిష్‌కి గొడ‌వ అయింద‌ట‌. ఆ విష‌యాన్ని క్రిష్ ఇపుడు బాలీవుడ్ మీడియాకి ఇచ్చిన ఇంట‌ర్వ్యూల్లో బ‌య‌ట‌పెట్టాడు.

సోను పోషించిన స‌దాశివ‌రావు పాత్ర ఝాన్సీ ల‌క్ష్మీబాయ్ జీవితంలో కీలకమైన పాత్ర. కానీ ఆ పాత్ర‌ని ముందే చంపేయ‌మ‌ని కంగ‌నా కోరింది. అలా చేస్తే చరిత్రను వక్రీకరించడమే అవుతుంది, నేను షూట్‌ చేయనని చెప్పాను. ఆ త‌ర్వాత కొన్ని రోజుల‌కి... నా పనితనం జీ స్టూడియోస్‌కు నచ్చలేదని కంగన నన్ను నమ్మించింది. ఓ భోజ్‌పూరి సినిమాలా తీశాన‌ని నిర్మాత‌లన్న‌ట్లు ఆమె నాతో చెప్పారు. కొన్ని రోజుల‌కి ఇక కంగ‌న డెరెక్ట్‌ చేస్తుందని కమల్‌ జైన్ చెప్పారు. దాంతో నేను త‌ప్పుకున్నాను అని క్రిష్ బాలీవుడ్ మీడియాకి చెప్పాడు. 

ఇంత‌కీ ఇపుడు విడుద‌లైన సినిమాలో క్రిష్ తీసిన సీన్లు ఎన్ని, ఆమె రీషూట్ చేసిన‌వెన్ని? క‌్రిష్ మాట‌ల ప్ర‌కారం... ప్ర‌థ‌మార్థంలో 30 శాతం కంగ‌న డైర‌క్ట్ చేసిన స‌న్నివేశాలున్నాయి. ద్వితీయార్థంలో 15 శాతం సీన్లు ఆమె తీసిన‌వి క‌నిపించాయి. మిగ‌తా అంతా క్రిష్ తీసిన‌దేన‌ట‌.