పోటీ ప‌డి మ‌రీ ప్ర‌ద‌ర్శిస్తోంది క‌దా!

Kangana hot show at Cannes
Saturday, May 18, 2019 - 17:00

దీపిక ప‌దుకొనే, ప్రియాంక చోప్రా, కంగ‌న ర‌నౌత్‌..ఈ ముగ్గురు భామ‌లు ఈసారి కాన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ సంద‌ర్భంగా అంద‌చందాల‌ను ఫుల్లుగా ప్ర‌ద‌ర్శించారు. రెడ్ కార్పెట్‌పై హోయ‌లు ఒలికించారు. ఐతే ఈ ముగ్గురిలో క్లీవేజ్ షోతో కిరాక్ పుట్టించిన భామ మాత్రం కంగ‌న‌నే.

డేరింగ్ హీరోయిన్ పేరు తెచ్చుకున్న కంగ‌న....ఈ సారి మ‌రింత‌గా రెచ్చిపోయింది ఎక్స్‌పోజింగ్ విష‌యంలో. అంత‌ర్జాతీయ మీడియా దృష్టిలో ప‌డేందుకు చేయాల్సిందంతా చేసింది. నిజానికి ఈ ముగ్గురు హీరోయిన్లు అక్క‌డికి వెళ్లింది త‌మ సినిమాల ప్ర‌మోష‌న్ కోసం కాదు. వారు న‌టించిన ఏ సినిమా కూడా అక్క‌డ ప్ర‌ద‌ర్శితం కావ‌డం లేదు. కేవ‌లం గ్లామ‌ర్ అట్రాక్ష‌న్ కోస‌మే! హాలీవుడ్ హీరోయిన్ల సందడి ఈ సారి కొంత త‌క్కువుంది కాన్స్‌లో. ఆ లోటుని వీరు భ‌ర్తీ చేశారు. కంగ‌న ఓ రేంజ్‌లో చేసింది.