క్రిష్‌కి కంగ‌న సోద‌రి ఘాటు రిప్ల‌యి

Kangana Ranaut's sister Rangoli lashes out at director Krish
Monday, January 28, 2019 - 15:00

నేను బంగారంలాంటి సినిమాని తీసి ఇస్తే ...దాన్ని కంగన వెండిగా మార్చింద‌ని క్రిష్ వాపోతున్నారు. "మ‌ణిక‌ర్ణిక" విడుద‌ల త‌ర్వాత క్రిష్..ముంబై మీడియాకి అదే ప‌నిగా ఇంట‌ర్య్వూలు ఇస్తున్నారు. విడుద‌లైన సినిమాలో ఇప్ప‌టికి 70 శాతం త‌న‌దే అని అంటున్న క్రిష్‌కి కంగ‌న సిస్ట‌ర్ రంగోలి ఘాటుగా స‌మాధానం ఇచ్చింది.

బాబూ స‌రే ...సినిమా అంతా మీరే తీశార‌ని ఒప్పుకుంటున్నాం. ఇక శాంతించు. కంగ‌న ఫేస్ వ‌ల్లే సినిమా ఆడుతుంద‌నేది వాస్త‌వం క‌దా. ఆమెని అలా వ‌దిలెయ్యి. ఆమె స‌క్సెస్‌ని ఎంజాయ్ చేయ‌నివ్వు. ఇక మీ ప‌ని మీరు చూసుకొండి, అంటూ ట్వీట్ చేసింది రంగోలి. ఇన్‌డైర‌క్ట్‌గా భారీ సెటైర్ వేసింది.

క్రిష్ సినిమా రిలీజ్‌కి ముందు ఏమీ మాట్లాడ‌కుండా.. ఇపుడు సినిమాకి మంచి రివ్యూలు వ‌చ్చిన త‌ర్వాత నోరు విప్ప‌డంతో ఇలా విమ‌ర్శ‌లు ఎదుర్కోవాల్సి వ‌స్తోంది. మ‌రోవైపు, ఈ సినిమా ఇండియాలో , తొలి వీకెండ్ 40 కోట్ల రూపాయ‌లు కొల్ల‌గొట్టింది.