జాన్వీ చెల్లెలు కూడా అదే బ్యాన‌ర్‌లో

Karan to introduce Khushi Kapoor
Friday, December 28, 2018 (All day)

శ్రీదేవి రెండో కుమార్తె ఖుషి కపూర్ కూడా న‌టిగా ఎంట్రీ ఇవ్వ‌నుంది. మొద‌టి కూతురు జాన్వీ ఇప్ప‌టికే స‌క్సెస్‌ఫుల్ స్టార్‌గా మారింది. తొలి సినిమాతోనే స్టార్ అనిపించుకొంది. క‌ర‌ణ్ జోహ‌ర్ నిర్మించిన ‘ధడక్’ సినిమాతో ఆమె అరంగేట్రం చేసింది. క‌ర‌ణ్ బ్యాన‌ర్‌లోనే ఆమె మ‌రో రెండు సినిమాలు ఒప్పుకొంది. 

జాన్వీక‌పూర్ తండ్రి బోనీ క‌పూర్ ..బాలీవుడ్‌లో ఒక‌పుడు అగ్ర నిర్మాత‌. ఐతే సొంత బ్యాన‌ర్‌లో కాకుండా క‌ర‌ణ్ జోహ‌ర్ బ్యాన‌ర్‌లోనే రెండో కూతురు కూడా ప‌రిచ‌యం కానుంది. క‌ర‌ణ్ జోహ‌ర్ త్వ‌ర‌లోనే ఖుషీ క‌పూర్ హీరోయిన్‌గా ఒక మూవీ అనౌన్స్ చేసే అవ‌కాశం ఉంది. ఖుషీ మంచి టాలెంటెడ్ అంటూ ఇటీవ‌ల క‌ర‌ణ్ ఆమెపై ప్ర‌శంస‌లు కురిపించాడు.

జాన్వీలాగే ఖుషీ కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా పాపుల‌ర్‌. అందాల ప్ర‌ద‌ర్శ‌న‌తో కూడిన ఫోటోల‌ను ఈ భామ రెగ్యుల‌ర్‌గా షేర్ చేస్తుంటుంది. అందుకే ఆమెకి మంచి ఫాలోవ‌ర్స్ ఉన్నారు.