కేజీఎఫ్ హీరోపై సీఎం మండిపాటు

Karnataka CM' comments against Yash
Wednesday, April 17, 2019 - 13:30

కేజీఎఫ్ హీరోపై సీఎం మండిపాటు కేజీఎఫ్ హీరో యష్ కి ఇపుడు కన్నడనాట యూత్‌లో యమా ఫాలోయింగ్ వచ్చింది. యష్ ...తాజాగా జరుగుతున్న లోక్ సభ ఎన్నికల్లో జోరుగా ప్రచారం చేస్తున్నాడు. ఆయన ప్రచారం చేస్తున్నది నటి సుమలత తరఫున. కర్ణాటకలోని మాండ్య లోకసభ నియోజకవర్గం నుంచి సుమలత ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు.

తనకి కెరియర్ తొలినాళ్లల్లో సుమలత దివగంత భర్త అంబరీష్ ఎంతో హెల్ప్ చేశారన్న కృతజ్ఞత ఉంది యష్ కి. అందుకే సుమలత తరపున గట్టిగా ప్రచారం చేస్తున్నారు. ఇది కర్ణాటక ముఖ్యమంత్రికి నచ్చడం లేదు. కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు నిఖిల్ గౌడ మాండ్యలో జెడీఎస్ తరఫున పోటీలో ఉన్నారు. మాండ్య నియోజకవర్గం కుమారస్వామి కుటుంబానికి కంచుకోట.

"యష్ వంటి వాళ్లు వెండితెరపైనే హీరోలు, రియల్ లైఫ్‌లో కాదు. నేను ఆయనతో సినిమాలు నిర్మించారు. ఇలాంటి చేష్టలు చేస్తే మాలాంటి నిర్మాతలు ఎవరూ యష్‌తో సినిమాలు చేయరు." అంటూ కుమారస్వామి మండిపడుతున్నారు.యష్ మాత్రం జంకడం లేదు. సుమలతకే తన మద్దతని మరోసారి ప్రకటించాడు.