చిరు టైటిల్స్ పై కార్తి క్లారిటీ

Karthi gives clarity on Chiranjeevi titles
Monday, December 16, 2019 - 22:00

మొన్నటికిమొన్న ఖైదీ అనే టైటిల్ వాడేశాడు. ఇప్పుడేమో దొంగ అనే టైటిల్ తో సినిమా రిలీజ్ చేస్తున్నాడు. ఈ రెండూ చిరంజీవి టైటిల్సే. దీంతో కార్తిపై ఆమధ్య ఓ రేంజ్ లో ట్రోల్ నడిచింది. మా మెగాస్టార్ టైటిల్స్ వాడొద్దురా బాబూ అంటూ చిరు అభిమానులు నానా హంగామా చేశారు. ఎట్టకేలకు చిరంజీవి టైటిల్స్ వాడుకోవడంపై క్లారిటీ ఇచ్చాడు కార్తి.

"ఖైదీ టైటిల్ చిరంజీవి గారిది అని తెలియగానే చాలా సంతోషం వేసింది. నేను తీసిన ఖైదీ సినిమాకు కూడా అది యాప్ట్ టైటిల్. సినిమా చూసిన వాళ్లంతా అదే ఫీలయ్యారు కూడా. ఇక ఈ లేటెస్ట్ సినిమా తమ్ముడు టైటిల్ అనుకున్నాం కానీ దొరకలేదు. ఇప్పుడు మళ్ళీ 'దొంగ' కూడా చిరంజీవి గారి టైటిల్ కావడం నిజంగా హ్యాపీ" చిరంజీవి టైటిల్స్ తన సినిమాలకు సెట్ అవ్వడాన్ని గౌరవంగా, గర్వంగా భావిస్తున్నానని ప్రకటించాడు కార్తి.

కావాలని తమ సినిమాలకు చిరంజీవి టైటిల్స్ పెట్టడం లేదని, అలా పెట్టాలనుకుంటే ఈపాటికి ఎన్నో టైటిల్స్ వాడేసేవాడినని అంటున్నాడు. ఈ సందర్భంగా ఓ లాజిక్ కూడా బయటపెట్టాడు.