మొత్తానికి RX100 హీరో ఒప్పుకున్నాడు క‌దా

Kartikeya Gummakonda acts in Nani's film
Monday, February 18, 2019 - 15:30

తొలి సినిమా "ఆర్ ఎక్స్ 100"తోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు కార్తీకేయ‌. ఈ కుర్ర‌హీరో ఇపుడు మూడు సినిమాల్లో హీరోగా న‌టిస్తున్నాడు. మూడు సినిమాలు వేర్వేరు ద‌శ‌ల్లో షూటింగ్‌లో ఉన్నాయి. తాజాగా నాని సినిమాలోనూ కీల‌క పాత్ర‌కి ఒప్పుకున్నాడు. కెరియ‌ర్ ప్రారంభంలోనే ఒక హీరో సినిమాలో కీల‌క పాత్ర‌కి ఒప్పుకుంటే స‌మ‌స్య వ‌స్తుంద‌ని మొద‌ట భ‌య‌ప‌డ్డాడు. చివ‌రికి విక్ర‌మ్‌కుమార్ డైర‌క్ష‌న్‌లో నాని హీరోగా రూపొందుతోన్న తాజా సినిమాని సైన్ చేశాడు. ఈ సినిమా షూటింగ్ మొద‌లైంది కానీ కార్తీకేయ కొద్ది రోజుల త‌ర్వాత జాయిన్ అవుతాడు.

అవును ఇది అఫీషియ‌ల్‌. న‌టుడిగా మారేందుకు స్ఫూర్తినిచ్చిన హీరోల్లో నాని ఒక‌రు. ఆయ‌న‌తో క‌లిసి కెమెరా ఫేస్ చేసేందుకు ఆగ‌లేకుండా ఉన్నాను అంటూ త‌న అభిప్రాయాన్ని ట్విట్ట‌ర్‌లో షేర్ చేశాడు కార్తీకేయ గుమ్మ‌కొండ‌.

''ఫస్ట్‌ టైమ్‌ నేను ఎంటర్‌టైన్‌మెంట్‌ మూవీ చేస్తున్నాను. ఎంటర్‌టైన్‌మెంటే కాకుండా ఈ సినిమాలో ఓ ఇంట్రెస్టింగ్‌ పాయింట్‌ కూడా ఉంటుంది. అది ఏమిటనేది స్క్రీన్‌పైన చూస్తేనే బాగుంటుంది. టెక్నికల్‌గా చాలా హై స్టాండర్డ్స్‌లో ఉండే సినిమా ఇది'' అన్నారు దర్శకుడు విక్రమ్‌ కె.కుమార్‌.

మైత్రీ మూవీస్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో నాని స‌ర‌స‌న‌ ప్రియాంక, లక్ష్మీ, శరణ్య న‌టిస్తున్నారు. అనీష్‌ కురువిళ్లా, ప్రియదర్శి, రఘుబాబు, వెన్నెల కిశోర్‌, జైజా, సత్య తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.