ఒకే ఇయర్లో నాలుగో చిత్రం రిలీజ్

Kartikeya releasing fourth movie this year
Monday, November 11, 2019 - 10:00

కార్తికేయ ఈ ఏడాది  ఇప్పటికే హీరోగా హిప్పీ , గుణ 369 సినిమాలు రిలీజ్ చేసాడు. అలాగే గ్యాంగ్ లీడర్ సినిమాలో విలన్ గా నటించాడు. అది కూడా విడుదలైంది. అంటే ఈ ఏడాది ఇప్పటికే మూడు సినిమాలు తీసుకొచ్చాడు. ఇప్పుడు నాలుగో సినిమా రిలీజ్ చేస్తున్నాడు. 

కార్తికేయ హీరోగా నటించిన మరో మూవీ..  '90 ఎం.ఎల్‌`. ఈ సినిమాకి రిలీజ్ డేట్ ఫిక్స‌యింది. డిసెంబ‌ర్ 5న విడుద‌ల చేయ‌నున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఈ చిత్రంతో శేఖర్‌ రెడ్డి ఎర్ర దర్శకునిగా పరిచయమవుతున్నారు. 'ఆర్‌ ఎక్స్100' తో సంచలన విజయం సృష్టించిన కార్తికేయ క్రియేటివ్‌ వర్క్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. నేహా సోలంకి కథానాయిక. ఈ చిత్రం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ థియేట్రిక‌ల్ రైట్స్ ని శ్రీ వైష్ణ‌వి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఫ్యాన్సీ ఆఫ‌ర్‌కి సొంతం చేసుకుంది.

మరి ఈ సినిమాతో ఆయినా కార్తికేయ హిట్ కొడుతాడా ఈ ఏడాది అనేది చూడాలి