మూడు సినిమాలు, రెండు ప్లాఫ్‌లు

Kartikeya scores two flops
Saturday, June 8, 2019 - 23:15

"ఆర్ ఎక్స్‌100" సినిమాతో పాపుల‌ర్ అయిన కార్తీకేయ ఇప్ప‌టికే మూడు సినిమాలు విడుద‌ల చేశాడు.  "ఆర్ ఎక్స్100" ఆయ‌న‌కి తొలి చిత్రం అని చాలా మంది పొర‌ప‌డుతున్నారు. కాదు, అది ఆయ‌న‌కి రెండో మూవీ. మొద‌టి చిత్రం... "ప్రేమ‌తో మీ కార్తీక్‌". ఆ సినిమా డిజాస్ట‌ర్‌గా నిలిచింది. ల‌క్కీగా రెండో సినిమా సూప‌ర్‌హిట్ అవ‌డ‌మే కాదు విప‌రీత‌మైన గుర్తింపునిచ్చింది. ఐతే, మూడో చిత్రాన్ని స‌రిగా ప్లాన్ చేసుకోక మ‌ళ్లీ దెబ్బ‌తిన్నాడు.

"ఆర్ ఎక్స్100" సినిమాలో తాను ష‌ర్ట్ ఇప్ప‌డం వ‌ల్ల, హీరోయిన్‌తో ముద్దులు పెట్టుకోవ‌డం వ‌ల్లే హిట్ట‌యింద‌ని కార్తీకేయ భావించిన‌ట్లు ఉంది. అందుకే మూడో సినిమా "హిప్పీ"లో వాటి డోస్ పెంచాడు. అదేదో సినిమాలో క్యార‌క్ట‌ర్ ఆర్టిస్ట్‌...స‌మ‌ర్పించేస్తా స‌మ‌ర్పించేస్తా అని మాటీమాటికీ అన్న‌ట్లు కార్తీకేయ ఈ సినిమాలో రెండు మూడు సీన్ల‌కి ఒక‌సారి ష‌ర్ట్ విప్పేశాడు. ఐతే ఇంత వి(హి)ప్పినా జ‌నం చూసేందుకు రాలేదు.  చేసిన మూడు సినిమాల్లో రెండు దారుణాతి ప‌రాజయాల‌ను మూట‌గ‌ట్టుకొని ...మ‌ళ్లీ క‌థ‌ని మొద‌టి సీన్‌కి తెచ్చాడు. అంటే నెక్స్ట్ సినిమాతో మ‌ళ్లీ త‌న‌ని తాను ప్రూవ్ చేసుకోవాలి. 

చేతిలో "గుణ360", "గ్యాంగ్‌లీడ‌ర్" (ఇందులో విల‌న్ రోల్‌) ఉన్నాయి. మ‌రి కార్తీకేయ ఇపుడైనా క‌థ‌పై దృష్టి పెడుతాడా?