ప్రభాస్ సరసన కత్రిన? నిజమేనా?

Is Katrina being considered for Prabhas21?
Thursday, March 12, 2020 - 13:00

ఇప్పటికే సాహోలో శ్రద్ధాకపూర్ తో ఆడిపాడాడు యంగ్ రెబల్ స్టార్. ఇప్పుడు తన నెక్ట్స్ మూవీకి మరో బాలీవుడ్ ముద్దుగుమ్మతో ఆడిపాడబోతున్నాడు. ఈసారి ఏకంగా కత్రినాకైఫ్ పై కన్నేశాడు ప్రభాస్. అవును.. అన్నీ అనుకున్నట్టు జరిగితే నాగ్ అశ్విన్ సినిమాలో ప్రభాస్ సరసన కత్రినాకైఫ్ హీరోయిన్ గా నటించనుంది. ఈ మేరకు దర్శకుడు నాగ్ అశ్విన్ ఫీలర్ వదిలాడు.

కత్రినాకైఫ్ కు టాలీవుడ్ కొత్త కాదు. కెరీర్ స్టార్టింగ్ లో ఆమె తెలుగు సినిమాల్లో నటించింది. వెంకటేష్ తో మల్లీశ్వరి, బాలకృష్ణతో అల్లరి పిడుగు లాంటి సినిమాలు చేసింది. ఆ తర్వాత బాలీవుడ్ లో ఆమె క్లిక్ అవ్వడం, ఊహించని క్రేజ్ తో అక్కడే ఫిక్స్ అవ్వడం చకచకా జరిగిపోయాయి. మళ్లీ ఇన్నాళ్లకు ఆమెను టాలీవుడ్ స్క్రీన్ పైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడట నాగ్ అశ్విన్.

ప్రభాస్ తో తను చేయబోయే సైన్స్ ఫిక్షన్ సినిమా పాన్-ఇండియా మూవీ కాదని, అది పాన్-వరల్డ్ మూవీ అంటూ ఇప్పటికే ప్రకటించిన ఈ డైరక్టర్.. అందుకు తగ్గట్టుగానే నటీనటుల్ని సెలక్ట్ చేసే పనిలో పడ్డాడు. ఇందులో భాగంగానే ఎంత ఇచ్చయినా కత్రినాను తీసుకోవాలని భావిస్తున్నారు.

అటు కత్రినాకైఫ్ కూడా ఈ ఆఫర్ కు ఒప్పుకునే అవకాశాలున్నాయి. ఎందుకంటే ఆమెకు బాలీవుడ్ లో ఇప్పుడు బాలీవుడ్ లో మెల్లగా అవకాశాలు తగ్గుతున్నాయి. ప్రస్తుతం ఆమె చేతిలో ఒకేఒక్క హిందీ సినిమా ఉంది. కాబట్టి ఆమె బాహుబలి సరసన నటించడానికి నో చెప్పకపోవచ్చు. ఎటొచ్చి రేటు తెగాలంతే.