ఆ హీరోతో కత్రిన డేటింగ్?

Is Katrina dating Vicky Kaushal?
Tuesday, October 29, 2019 - 14:00

బాలీవుడ్ ప్రేమలు, రిలేషన్స్ విచిత్రంగా ఉంటాయి. దీపిక ...రణబీర్ కపూర్ తో డేటింగ్ చేసి.. చివరికి అతని వైఖరితో విసుగెత్తి రణ్వీర్ సింగ్ ని పెళ్లాడింది. ఇప్పుడు కత్రిన కైఫ్ కూడా అదే దారిలో వెళ్తోందా? సల్మాన్ ఖాన్ కి డిచ్ కొట్టి రణబీర్ కపూర్ తో మూడేళ్లు డేటింగ్ చేసింది కత్రిన. ఐతే, కత్రినకి రణబీర్ డిచ్ కొట్టాడు. ఇప్పుడు అలియా భట్ ని పెళ్లాడే మూడులో ఉన్నాడు. 

మొన్నటి వరకు సింగల్ గాల్ గానే ఉన్న కత్రిన...ఇప్పుడు డేటింగ్ షురూ చేసింది అనేది టాక్. తాజాగా దీపావళి పండగకి విక్కీ కౌశల్ ఇంటికి వెళ్లి అతనితో పండగ సెలెబ్రేట్ చేసుకోంది. ఇద్దరు ప్రేమలో ఉన్న జంటలాగే బెహవ్ చేశారు. వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారని చాలా కాలంగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ దీపావళి ఫొటోలతో అవి నిజం అనిపిస్తోంది. 

విక్కీ కౌశల్ ... ఇప్పుడు బాలీవుడ్ లో రైజింగ్ స్టార్. యూరి ది సర్జికల్ స్ట్రైక్ సినిమాతో స్టార్ గా ఎదిగాడు.