క‌త్రిన కైఫ్ మ‌ళ్లీ డేటింగ్ చేస్తోందా?

Katrina Kaif dating Vicky Kaushal?
Tuesday, May 28, 2019 - 11:00

క‌త్ర‌న కైఫ్ మ‌ళ్లీ ప్రేమ‌లో ప‌డిందా? ఆమెకి ప్రేమాయ‌ణాలు కొత్త కాదు. స‌ల్మాన్‌ఖాన్‌తో చాలా కాలం స‌హ‌జీవ‌నం చేసింది. ఆ త‌ర్వాత ర‌ణ‌బీర్ క‌పూర్‌ని ప్రేమించింది. పెళ్లి చేసుకోవాల‌నుకొంది. కానీ ర‌ణ‌బీర్ క‌పూర్ ఆమెకి హ్యండిచ్చి ఆలియా భ‌ట్‌తో ల‌వ్‌లో ప‌డ్డాడు.

మొన్న‌టి వ‌ర‌కు బ్రేక‌ప్ బాధ‌లో ఉన్న క‌త్రిన రీసెంట్‌గా విక్కీ కౌష‌ల్‌కి ద‌గ్గ‌ర‌యింద‌ని బాలీవుడ్ గుస‌గుస‌. విక్కీ కౌష‌ల్ ఇపుడు బాలీవుడ్‌లో రైజింగ్ స్టార్‌. ప‌లు సినిమాల్లో స‌పోర్టింగ్ రోల్స్ చేశాడు. ఐతే హీరోగా న‌టించిన యూరి స‌ర్జిక‌ల్ స్ట్ర‌యిక్ సినిమా దాదాపు 250 కోట్ల రూపాయ‌లు కొల్ల‌గొట్ట‌డంతో విక్కీ స్టార్‌డ‌మ్ అమాంతం పెరిగింది. 

విక్కీతో వ‌రుస‌గా సినిమాలు అనౌన్స్ చేస్తున్నాయి బాలీవుడ్ నిర్మాణ సంస్థ‌లు. ఈ కుర్ర హీరోతో క‌త్రిన ఈ మ‌ధ్య చాలా క్లోజ్‌గా క‌నిపిస్తోంద‌ట‌.