ఎన్టీఆర్ బ‌యోపిక్‌కి ప్రత్యేక షోలు క‌ష్ట‌మే!

KCR no to to give special incentives to NTR Biopic
Thursday, December 13, 2018 - 17:15

ఎన్నిక‌ల ప్ర‌చారం సంద‌ర్భంగా బాల‌య్య శ్రుతి మించి విమ‌ర్శ‌లు చేశాడు. తెలంగాణ కేసీఆర్‌పై రాజ‌కీయ విమ‌ర్శ‌లు కాకుండా మ‌రీ ప‌ర్స‌న‌ల్‌గా తిట్టాడు. దాంతో కేసీఆర్ కుమారుడు మంత్రి కేటీఆర్ బాల‌య్య‌ని ట్రాల్ చేస్తూ జ‌నాలు షేర్ చేసిన బుల్ బుల్ వీడియాల‌ను త‌ను కూడ రీట్వీట్ చేశాడు.

బాల‌య్య‌, కేసీఆర్ కుటుంబానికి మ‌ధ్య ఇపుడు మున‌ప‌టి సంబంధాలు లేవు. గ‌తంలో బాల‌య్య వందో సినిమా గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి చిత్రానికి కేసీఆర్ అవుటాప్‌ది వే వెళ్లి ట్యాక్స్ రాయితీలు, ప్ర‌త్యేక షోలకి అనుమ‌తి ఇచ్చారు. ఐతే జీఎస్టీ వ‌చ్చిన త‌ర్వాత ట్యాక్స్ రాయితీల‌కి స్కోప్ లేదు. కానీ ప్ర‌త్యేక షోల‌కి మాత్రం ప్ర‌భుత్వం నుంచే అనుమ‌తి తీసుకోవాలి.

మ‌రి ఇపుడు ఎన్టీఆర్ బ‌యోపిక్‌కి కేసీఆర్ ప‌ర్మిష‌న్ ఇస్తారా? బ‌ఆ బాల‌య్య రాజ‌కీయ జ్ఞానం అంతే అనుకొని లైట్ తీసుకొని య‌థావిధిగా మ‌ర్యాద చూపుతారా అనేది చూడాలి.

ఎన్టీఆర్ బ‌యోపిక్‌కి ఆంధ్రాలో క్రేజ్ ఉన్నా..నైజాంలో అంత క్రేజ్ ఉండే అవ‌కాశం క‌నిపించ‌డం లేదు. ఎన్టీఆర్ ...కేసీఆర్‌కి రాజ‌కీయ గురువు. కానీ మారిన ప‌రిస్థితుల్లో ఈ సినిమాకి ప్ర‌త్యేక ప‌ర్మిష‌న్లు ఇచ్చే అవ‌కాశం మాత్రం త‌క్కువే.