కీర్తి...మ‌రీ ఇంత‌లా మారిపోయిందేంటి?

Keerthy slims but fans are not happy
Saturday, June 15, 2019 - 15:00

కీర్తి సురేష్ ఇటీవ‌ల బాగా స‌న్న‌ప‌డింది. ఆమె తాజాగా స్పెయిన్‌కి వెళ్లింది. అక్క‌డి నుంచి కొత్త ఫోటోలు అప్‌లోడ్ చేసింది. అస్స‌లు ఎవ‌రూ గుర్తుప‌ట్ట‌లేనంత‌గా మారిపోయింది. ఒక‌పుడు బొద్దుగా ఉండేది. ఐతే..మ‌హాన‌టి త‌ర్వాత మ‌రీ బొద్దుత‌నం ఎక్కువ‌పోయింద‌న్న కామెంట్స్ ప‌డ‌డంతో వాటిని సీరియ‌స్‌గా తీసుకోని లావు త‌గ్గ‌డం మొద‌లుపెట్టింది. ఇపుడు స‌న్న‌బ‌డింది కానీ ఫేస్‌లో ఆ అందం త‌గ్గింది. అందుకే ఇలా మారిందేంటి అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఆమె ప్ర‌స్తుతం ఒక లేడీ ఓరియెంటెడ్ మూవీ చేస్తోంది. ఆ సినిమా కోసం స్పెయిన్ వెళ్లింది.బొద్దుగా ఉన్న‌ప్పుడే బాగుంద‌ని ఇపుడు అంటున్నారు.