కరోనా: కేరళలో థియేటర్లు బంద్

Kerala shuts movie theaters for a month after corona outbreak
Tuesday, March 10, 2020 - 16:00

ఇండియాలో కరోనా స్ప్రెడ్ మొదలు అయింది కేరళలో. అక్కడ ఇంకా కొత్తగా కేసులు నమోదు అవుతున్నాయి. ఐతే, కేరళ ప్రభుత్వం కరోనా నియంత్రణకై కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. ఆ లక్షణాలు కనిపించాయని తెలిస్తే చాలు ఇంటికి కలెక్టర్ స్వయంగా ఇంటికి వచ్చి పేషంట్ ని ఆసుపత్రిలో జాయిన్ చేస్తున్నారు. మరింత ముందు జాగ్రత్తగా రాష్ట్రంలోని అన్ని థియేటర్లని ఈ నెలాఖరు వరకు బంద్ చేస్తే మంచింది అని కేరళ ముఖ్యమంత్రి మలయాళ చిత్రసీమని కోరారు. దాంతో పరిశ్రమ స్పందించింది. 

ఈనెల 31 వరకు కేరళలో సినిమా థియేటర్లు రన్ అవ్వవు. ఈ నెల 26న విడుదల కావాల్సిన మోహన్ లాల్ చిత్రం "మరక్కార్ అరబిక్ కడలింతే సింహం "  కూడా పోస్టుపోన్ అయింది. 

తెలంగాణలో కూడా ఇలాగే చెయ్యాలని గతవారం తెలుగు చిత్ర సీమ పెద్దలు భావించారు. కానీ ప్రభుత్వం నుంచి ఆ ప్రతిపాదన రాకుండా మనమే చేస్తే ఇబ్బంది అని ఆగారు.