చిన్న కూతురు కేక పుట్టిస్తోంది!

Khushi Kapoor was the best dressed guest?
Wednesday, October 3, 2018 - 22:30

శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ క‌పూర్ ఇప్ప‌టికే హీరోయిన్‌గా స్థిర‌ప‌డింది. తొలి సినిమాతోనే కుర్రాళ్ల గుండెల‌కి ధ‌డ‌క్ క‌లిగించింది. అందచందాల‌తో మెప్పించింది. అభిన‌యం ప‌రంగా కూడా పాస్ మార్కులు తెచ్చుకొంది. ఐతే శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ క‌పూర్ మాత్రం టోట‌ల్‌గా గ్లామ‌ర్ గాల్‌గా పేరు తెచ్చుకోవాల‌నుకుంటున్న‌ట్లుంది. ఆమె తాజాగా చేస్తున్న అందాల షో చూస్తే ఎవ‌రికైనా ఇదే అనుమానం వ‌స్తుంది.

ఖుషీ క‌పూర్ కూడా త్వ‌ర‌లోనే హీరోయిన్‌గా అరంగేట్రం చేయ‌నుందట‌. మ‌రో ఏడాదిలో ఆమె రంగ‌ప్ర‌వేశం చేయ‌నుంది. ఇప్ప‌టికే న‌టన‌లో ట్ర‌యినింగ్ తీసుకుంటోంది. ప్ర‌స్తుతం ఆమె ఇన్‌స్ట్రాగ్రామ్ సాక్షిగా వ‌డ్డిస్తోన్న‌ గ్లామ‌ర్ విందు చూస్తుంటే కుర్రాళ్ల‌కి ఇక ముందు ముందు ఖుషీ టైమ్సే.