ఆ ప్ర‌యోగం ఎంతో ఫ‌న్‌: కియ‌రా

Kiara Advani says it was fun to shoot for vibrator scene in Lust Stories
Friday, January 4, 2019 - 15:45

ఇటీవ‌ల బాగా పాపుల‌ర్ అయిన పాట‌... ఎంతో ఫ‌న్ అనే సాంగ్‌. "ఎఫ్ 2" సినిమాలో ఉంది ఈ పాట‌. దాదాపు ఈ పాట‌ని పాడుతోంది కియరా అద్వానీ ..వైబ్రేట‌ర్ సీన్ గురించి అడిగిన‌పుడు. "భ‌ర‌త్ అనే నేను" సినిమాతో తెలుగునాట అడుగుపెట్టిన ఈ బాలీవుడ్ భామ గ‌తేడాది "ల‌స్ట్ స్టోరీస్" అనే హిందీ చిత్రాన్ని చేసింది. అది నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. ఆ సినిమాలో ఆమె వైబ్రేట‌ర్‌తో హ‌స్త‌ప్ర‌యోగం చేసుకునే సీన్‌లో న‌టించింది. ఈ సీన్ గురించి ప్ర‌స్తావ‌న తీసుకొస్తే.. అది చాలా ఫ‌న్ సీన్ అని చెప్పింది. అందులో ఎబ్టెట్టుగా ఫీల్ అయ్యేదేమీ లేద‌ని అంటోంది.

"విన‌య విధేయ రామ" సినిమాలో ఆమె చ‌ర‌ణ్‌కి గాల్‌ఫ్రెండ్‌గా న‌టించింది. ఈ సినిమా ప్ర‌మోష‌న్ కోసం హైద‌రాబాద్ వ‌చ్చింది. మీడియాతో చిట్‌చాట్‌లో  ఈ సీన్ గురించి ప్ర‌స్తావ‌న వ‌చ్చిన‌పుడు ఇలా స్పందించింది.

అందులో అస‌భ్య‌త లేదు. అశ్లీలం లేదు. నేటి త‌రం అమ్మాయిలు లైంగిక స్వేఛ్చ‌ని కోరుకుంటున్నారు. దాన్ని ద‌ర్శ‌కుడు అందంగా ప్ర‌తిబింబించాడు. ముఖ్యంగా ఇది లైట‌ర్‌వీన్ సీన్‌. కాబ‌ట్టి న‌టించాను అని వివ‌ర‌ణ ఇచ్చింది.

బోల్డ్ సీన్లు చేసేందుకు ఈ భామ‌కి అభ్యంత‌రం లేద‌నిపిస్తోంది. కానీ టాలీవుడ్‌లో మాత్రం ఆమె ప‌క్కా మాస్ సినిమా హీరోయిన్‌గానే న‌టిస్తోంది.