కియారా ఫిజిక్ అదుర్స్‌

Kiara Advani turning fashion icon
Friday, August 17, 2018 - 20:30

"భ‌ర‌త్ అనే నేను" సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కి ప‌రిచ‌య‌మైన కియారా అద్వానీ ఇపుడు ఫ్యాష‌న్ ఐకాన్‌గా మారుతోంది. భ‌ర‌త్ అనే నేనులో అంత అద్భుతంగా క‌నిపించ‌లేదు కానీ ఆమె అస‌లైన సౌంద‌ర్యం ఇపుడు తెలుస్తోంది. రీసెంట్‌గా ఆమె చాలా ఫ్యాష‌న్‌బుల్‌గా మారింది. ఆమె శ‌రీర సౌష్ట‌వం అదుర్స్ అని ఒక ఫ్యాష‌న్ డిజైన‌ర్ ప్ర‌క‌టించింది. అందుకే ఆమెని ఇపుడు ఫ్యాష‌న్ ఈవెంట్స్‌కి ఎక్కువ‌గా పిలుస్తున్నార‌ట‌.

కియారా తాజాగా తెలుగులో రామ్‌చ‌ర‌ణ్ స‌ర‌స‌న న‌టిస్తోంది. బోయ‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో ఆమె అల్ట్రా గ్లామ‌ర‌స్‌గా క‌నిపిస్తుంద‌ట‌.