చీరకట్టుతో కియరా క్యా కియా రే!

KIara Advani turns up the heat with Saree attire
Tuesday, December 17, 2019 - 18:00

గ్లామరస్ గా కనిపించాలంటే వెస్ట్రన్ దుస్తులే వేయనక్కర్లేదు. చీరకట్టుతో కూడా పిచ్చెక్కించొచ్చు. ఈ విషయాన్ని ఇప్పటికే కొంతమంది హీరోయిన్లు ప్రూవ్ చేసి చూపించారు. ఇప్పుడు కియరా అద్వానీ కూడా అదే పనిచేసింది. ఈమెను ఎక్కువగా మోడ్రన్ డ్రెస్సుల్లోనే చూసిన జనాలు, తాజాగా ఆమె చీరకట్టు లుక్ చూసి తెగ గంతులేస్తున్నారు.

నిజంగా చీరకట్టులో కియరా అద్వానీ అద్భుతంగా ఉంది. ఆమె లుక్స్ కు, ఆ చీరకట్టుకు సరిగ్గా సరిపోయింది. లస్ట్ స్టోరీస్ లాంటి వెబ్ సిరీస్ లో ఎరోటిక్ గా కనిపించిన కియరా, ఇలా చీరకట్టులో కూడా అద్భుతంగా, సెక్సీగా కనిపించగలనని నిరూపించింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ అటు బాలీవుడ్ తో పాటు ఇటు సౌత్ లో కూడా యమ క్రేజ్ తో దూసుకుపోతోంది. కబీర్ సింగ్ సక్సెస్ తో ఆమె దశతిరిగింది. వరుసగా అవకాశాలు కొడుతోంది. మరో 10 రోజుల్లో రాబోతున్న గుడ్ న్యూజ్ అనే సినిమా కూడా హిట్ అయితే, ఆమె ఇక బాలీవుడ్ లో సెట్ అయిపోయినట్టే.

వచ్చే ఏడాదికి సంబంధించి ఇప్పటికే 4 సినిమాలు కియరా చేతిలో ఉన్నాయి. అన్నీ హిందీ సినిమాలే. వినయ విధేయ రామ తర్వాత ఆమె మళ్లీ సౌత్ సినిమాకు కమిట్ అవ్వలేదు. ఈ స్టిల్స్ చూసిన మేకర్ ఎవడైనా, తన సినిమాలో కియరాను ఒక్కసారైనా చీరకట్టులో చూపించడం గ్యారెంటీ. దటీజ్ ద మేజిక్ ఆఫ్ కియరా.