సాగ‌రక‌న్య‌గా మారిన కియరా

Kiara Advani's underwater daring act
Tuesday, January 1, 2019 - 22:15

తొలి సినిమాతోనే కుర్ర‌కారుకి హాట్ ఫేవ‌రేట్‌గా మారింది బాలీవుడ్ భామ కియ‌రా అద్వానీ. భ‌ర‌త్ అనే నేను సినిమాతో తెలుగులో అడుగుపెట్టిన కియ‌రా ప్ర‌స్తుతం ఇన్‌స్టాగ్రామ్‌ని షేక్ చేస్తోంది. ఆమె త‌న బికినీ ఫోటోల‌ను పోస్ట్ చేస్తోంది.

కియారా ప్ర‌స్తుతం విదేశాల్లో హాలీడేస్‌ని ఎంజాయ్ చేస్తోంది. కిలోలో కొద్దీ బికినీ సోయ‌గాల‌ను ఆర‌బోస్తోంది ఇన్‌స్టాగ్రామ్‌లో. అంతేకాదు తాను స‌ముద్ర గర్భంలో ఈత కొడుతున్న దృశ్యాల‌ను కూడా రికార్డు చేసి పోస్ట్ చేస్తోంది. సాహ‌స‌వీరుడు సాగ‌ర‌కన్య సినిమాలో శిల్పాశెట్టిలా అండ‌ర్‌వాట‌ర్‌లో ఆమె తెగ స్పీడ్‌గా ఈదుతోంది. ఒక ప్రొఫెష‌న‌ల్ స్విమ్మ‌ర్‌లా ఆమె ఈత ఉంది.

చ‌ర‌ణ్‌తో క‌లిసి కియ‌రా న‌టించి విన‌య విధేయ రామ సినిమా ఈ నెల 12న విడుద‌ల కానుంది. ఈ అందాల భామ‌ని త‌న సినిమాలో తీసుకోవాల‌ని త్రివిక్ర‌మ్ ఆలోచిస్తున్న‌ట్లు టాక్‌.