కియ‌రా.... వెర్రెక్కిస్తున్న అందం!

Kiara Hot show
Wednesday, March 6, 2019 - 22:30

భ‌ర‌త్ అనే నేను, విన‌య విధేయ రామ చిత్రాల‌తో తెలుగు కుర్రాళ్ల గుండెకి గాలం వేసిన కియ‌రా అంద‌చందాలు ఆర‌బోయ‌డంలో ఫ‌స్ట్‌నూ, బెస్ట్‌నూ. ఒక మేగ‌జైన్ కోసం ఆమె తాజాగా ఒక ఫోటోసూట్ చేసింది. ఇందులో త‌న అందాలు మ‌రింత య‌ధేచ్చ‌గా ప్ర‌ద‌ర్శించింది. అస‌లే ఎండాకాలంతో వాతావర‌ణం బాగా వేడెక్కింది. ఈ హీట్‌ని మ‌రింత పెంచేలా ఉంది ఈ బ్యూటీ చేస్తున్న సోయ‌గాల షో.

కియ‌రా ప్రస్తుతమైతే తెలుగులో ఏ మూవీ చేయ‌డం లేదు. వినయ విధేయ రామ త‌ర్వాత మ‌రో సినిమా సైన్ చేయలేదు. ఐతే బాలీవుడ్‌లో మాత్రం అర్జున్ రెడ్డి రీమేక్‌తో పాటు మ‌రో రెండు బ‌డా సినిమాలు ఆమె ఖాతాలో ఉన్నాయి.