విజ‌య్ తో సినిమా చేస్తా: కొర‌టాల‌

Koratala Siva says he'd plan some movie with Vijay Deverakonda
Monday, October 1, 2018 - 22:15

"నోటా" సినిమా పబ్లిక్ ఫంక్ష‌న్‌కి విచ్చేసిన ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ రౌడీలంతా ఖుషీ అయ్యే మాట చెప్పాడు. రౌడీలంటే విజ‌య్ దేవ‌ర‌కొండ అభిమానులు. త్వ‌ర‌లోనే విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో ఒక సినిమా తీస్తాన‌ని చెప్పాడు కొర‌టాల‌.

"పెళ్లిచూపులు సినిమా చూసిన వెంట‌నే విజ‌య్‌కి ఒక క‌థ రాయాల‌నిపించింది. అర్జున్ రెడ్డి చూసిన త‌ర్వాత షాక్ తిన్నాను. ఇక గీత గోవిందంతో మ‌రోసారి ఆశ్చ‌ర్య‌పోయా. ఇంత వెర్స‌టాలిటీ ఉన్న హీరో ఉంటే మంచి మంచి క‌థ‌లు రాయాల‌నిపిస్తుంది. త్వ‌ర‌లోనే ఒక మంచి స్ర్కిప్ట్‌తో విజ‌య్ దేవ‌ర‌కొండ‌ని తప్ప‌కుండా మీట్‌ అవుతా," అని ప్ర‌క‌టించాడు కొర‌టాల‌. దాంతో వెంట‌నే విజ‌య్ ..యావూ అన్న‌ట్లు ఆనందంగా సైగ చేశాడు.

కొర‌టాల శివ నిజంగా విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో మూవీ తీస్తాడా అన్న‌ది ప‌క్క‌న పెడితే.. ఈ యువ హీరోకిది బిగ్ బూస్ట్‌నిచ్చే మాటే. పెద్ద ద‌ర్శ‌కుల ఆలోచ‌న‌ల్లోకి కూడా ఈ యువ‌ హీరో రావ‌డం అంటే మాట‌లు కాదు క‌దా. కొర‌టాల త్వ‌ర‌లోనే మెగాస్టార్ చిరంజీవితో సినిమా మొద‌లుపెట్ట‌నున్నారు. ఈ ఏడాది డిసెంబ‌ర్‌లో కానీ, వ‌చ్చే జ‌న‌వ‌రిలో కానీ ఆ సినిమా సెట్స్‌పైకి వెళ్తుంది.