కొరటాల శివకి తప్పని నిరీక్షణ

Koratala Siva waiting mode
Friday, March 15, 2019 - 18:00

టాలీవుడ్‌లో అగ్రదర్శకులలో ఒకరు కొరటాల శివ. ఐనా ఆయనకి నిరీక్షణ తప్పడం లేదు. 'భరత్ అనే నేను' సినిమా గతేడాది ఏప్రిల్లో విడుదలైంది. 'భరత్ అనే నేను' విడుదలైన వెంటనే మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ డైరక్షన్లో నటించేందుకు అంగీకరించారు. గతేడాది నవంబర్ లోనే కథని ఓకే చేశారు. అప్పటి నుంచి కొరటాల శివ చిరంజీవి కోసం వెయిట్ చేస్తున్నారు.

చిరంజీవి ప్రస్తుతం "సైరా నర్సింహరెడ్డి" సినిమాలో నటిస్తున్నారు. అమితాబ్ బచ్చన్‌తో కలిసి చిరంజీవి షూటింగ్ లో పాల్గొంటున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయ్యేసరికి మరో రెండు నెలల టైమ్ పడుతుంది. అంటే అప్పటి వరకు చిరంజీవి కొరటాల శివ సినిమాని మొదలుపెట్టలేరు. ఆ లెక్కన... కొరటాల శివ, చిరంజీవి కాంబినేషన్‌లో మూవీ మొదలు కావాలంటే జూన్, జులై పడుతుందన్నమాట.

అంతకాలం కొరటాల శివకి నిరీక్షించక తప్పదు. ఎందుకంటే చిరంజీవిలాంటి సీనియర్ అగ్రహీరో ఒప్పుకున్న తర్వాత... అసహనం వ్యక్తం చేయలేం కదా. పైగా ఇందులో మెగాస్టార్ చేతిలో కూడా ఏమీలేదు. సైరా సినిమా షూటింగ్ అలా లేట్ అవుతోంది. కార‌ణం ఏదైనా యూ ఆర్ ఇన్ క్యూ అని వెయిట్ చెయ్య‌డ‌మే!