ఆగస్ట్‌ 23న 'కౌసల్య కృష్ణమూర్తి'

Kousalya Krishnamurthy on August 23
Thursday, August 1, 2019 - 09:45

తమిళంలో మంచి పేరు తెచ్చుకున్న నటి... ఐశ్వర్యా రాజేష్‌. తెలుగులో ఈ భామ విజయ్ దేవరకొండ సరసన కొత్త సినిమాలో ఎంట్రీ ఇస్తోంది. అలాగే మరో సినిమాలోనూ నటిస్తోంది. ఈ రెండు సినిమాల కన్నా ముందే ఆమె క్రికెటర్ గా నటించిన ఒక తెలుగు సినిమా రిలీజ్ కానుంది. క్రియేటివ్‌ కమర్షియల్స్‌ పతాకంపై భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో 'కౌసల్య కృష్ణమూర్తి ది క్రికెటర్‌' పేరుతో ఒక మూవీ రెడీ అయింది. ఈ చిత్రాన్ని ఆగస్ట్‌ 23న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. 

"ఆగస్ట్‌ 23 చాలా మంచి డేట్‌ అని భావించి ఆరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. టు హండ్రెడ్‌ పర్సెంట్‌తో ఎంతో విశ్వాసంతో, నమ్మకంతో ఈనెల 23న విడుదల చేస్తున్నాం. ఎటువంటి సినిమానైనా ఎదుర్కోగలుగుతుంది అనే నమ్మకం వచ్చిన తర్వాతే మా సినిమాను మీ ముందుకు తీసుకొస్తున్నాం. భీమనేని శ్రీనివాసరావు చేసిన ఓ మంచి సినిమా. ఐశ్వర్యా రాజేష్‌ అనే మంచి నటిని తీర్చిదిద్దిన సినిమా ఈ 'కౌసల్య కృష్ణమూర్తి'. ఎంతో గొప్పగా నటించిన రాజేంద్రప్రసాద్‌ ఈ సినిమాకి మెయిన్‌ ఎస్సెట్‌," అన్నారు నిర్మాత కె.ఎస్‌.రామారావు.