నిఖిల్ సరసన "ఉప్పెన" బ్యూటీ

Kriti gets chance to work with Nikhil Siddharth
Wednesday, March 18, 2020 - 17:45

రీసెంట్ గా గీతాఆర్ట్స్ 2 బ్యానర్ పై ఓ సినిమా లాంచ్ చేశాడు నిఖిల్. దీనికి 18 పేజెస్ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. ఇప్పుడీ సినిమాలో హీరోయిన్ ను ఫిక్స్ చేశారు. ప్రస్తుతం ఉప్పెన సినిమా చేస్తున్న కృతి శెట్టిని ఇందులో హీరోయిన్ గా తీసుకోవాలని ఫిక్స్ అయ్యారు. ఈ సెలక్షన్ వెనక ఉన్నది మరెవరో కాదు, స్వయానా సుకుమార్.

అవును.. సుకుమార్ కు ఈ రెండు సినిమాలతో కనెక్షన్ ఉంది. ఉప్పెన సినిమాకు సహ-నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు సుకుమార్. ఇక 18 పేజెస్ సినిమాకేతే సహ-నిర్మాతగా వ్యవహరించడంతో పాటు... ఈ సినిమాకు కథ-స్క్రీన్ ప్లే కూడా అందిస్తున్నాడు. ఉప్పెన టైమ్ లో కృతి శెట్టి పెర్ఫార్మెన్స్ ను ప్రత్యక్షంగా చూశాడు సుక్కూ.

కృతి శెట్టి మంచి పెర్ఫార్మర్ అనే విషయం తెలిసొచ్చింది. దీనికి తోడు 18 పేజెస్ కథ తనదే కావడంతో.. ఆ క్యారెక్టర్ కు కృతి అయితే బాగుంటుందని సుకుమార్ సూచన చేయడం.. దానికి బన్నీ వాస్ ఓకే చేయడం చకచకా జరిగిపోయాయి. అలా ఒక సినిమా కూడా విడుదలవ్వకుండానే మరో సినిమాలో ఆఫర్ కొట్టేసింది కృతి శెట్టి.