తీన్మార్ కృతి పెళ్లి ముహూర్తం!

Kriti Kharbanda sets wedding date
Wednesday, December 18, 2019 - 15:45

బాణం, తీన్మార్, ఒంగోలు గిత్త వంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించిన కృతి కర్బందా ... ప్రేమలో మునిగితేలుతోంది. బాలీవుడ్ హీరో పుల్కిత్ సామ్రాట్ తో కొంత కాలంగా డేటింగ్ చేస్తోంది. ఇప్పుడు వీరి లవ్ మేటర్ ఓపెన్ అయిపొయింది. దాచుకునేది ఏమి లేదు. ఇన్ స్టాగ్రామ్ లో ఈ అమ్మడే ... పుల్కిత్ తో దిగిన కొత్త ఫోటోని షేర్ చేసింది. ఈ జంట చూడచక్కగా ఉంది. 

రెండు లవ్ సింబల్స్ పెట్టి ఫోటో షేర్ చెయ్యడం, ఇద్దరు సాంప్రదాయ దుస్తుల్లోన్నే ఉండడంతోనే.. మేటర్ అందరికి అర్థం అయింది... ముహుర్తాల గోల ముంచుకొస్తోంది అని. బాలీవుడ్ మీడియా వార్తల ప్రకారం వీరి పెళ్లి వచ్చే ఏడాది ప్రారంభంలోనే ఉంటుంది అట. 

కృతి ఇటీవలే 'పాగల్ పన్తి', 'హౌస్ ఫుల్ 4' సినిమాలతో విజయాలు చూసింది.