బాత్‌ట‌బ్బు ష‌వ‌ర్‌లో కృతి!

Krit's Bath Towel photo shoot
Tuesday, January 8, 2019 - 23:45

"1 నేనొక్క‌డినే" సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కి ప‌రిచ‌య‌మైన కృతి సనన్ ఇపుడు తెలుగులోన‌టించ‌డం లేదు. "1 నేనొక్క‌డినే", "దోచేయ్" సినిమాల‌తోనే తెలుగు సినిమాల‌కి స్టాప్ పెట్టింది. ఇపుడు బాలీవుడ్‌లోనే బిజీగా ఉంది. ఈ అందాల భామ‌కి విజ‌యాలు త‌క్కువే కానీ పాపులారిటీ ఎక్కువ‌. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకున్న ఫాలోవ‌ర్స్ సంఖ్య అంతా ఇంతా కాదు. 

ఇన్‌స్టాగ్రామ్‌ని తమ బ్రాండ్‌ల‌ను ప్ర‌మోట్ చేసుకునేందుకు వాడుతున్నారు భామ‌లు. దిషా ప‌టానీ త‌న కాల్విన్ బ్రాండ్ బ్రాల కోసం తెగ ఎక్స్‌పోజింగ్ చేస్తూ ఫోటోలు షేర్ చేస్తుంటుంది. ఇక కృతి ఖాతాలోనూ ప‌లు బ్రాండ్‌లున్నాయి. ఆమె తాజాగా ఓ లినెన్ టవల్స్ బ్రాండ్‌కి బ్రాండ్ అంబాజిడర్ గా ఎంపికయింది. ఆ బ్రాండ్ కోసం ఇలా బాత్‌ట‌బ్బు సుంద‌రిగా మారింది.