క్ష‌ణం ద‌ర్శ‌కుడి ప‌రిస్థితి ఏంటి?

Kshanam director's career in shambles
Tuesday, April 23, 2019 - 14:30

"క్ష‌ణం" సినిమా గుర్తుందా? 2016లో విడుద‌లైన ఆ థ్రిల్ల‌ర్ సంచ‌ల‌న విజ‌యం సాధించింది. గొప్ప ప్ర‌శంస‌లు అందుకొంది. ఆ సినిమాతోనే అడివి శేషు హీరోగా నిల‌బడ్డాడు. ఆ త‌ర్వాత అడివి శేషు "అమీతుమీ"లోనూ, "గూఢ‌చారి" చిత్రంలోనూ నటించాడు. ఆగిపోయిన "2స్టేట్స్" రీమేక్ కూడా ఉంది ఆయ‌న ఖాతాలో. త్వ‌ర‌లోనే "మేజ‌ర్" అనే సినిమా మొద‌లుపెడుతాడు. "క్ష‌ణం" త‌ర్వాత ఇంత బిజీ అయ్యాడు అడివి శేషు.

మ‌రి ఆ సినిమా తీసిన ద‌ర్శ‌కుడు ఏమ‌య్యాడు? ర‌వికాంత్ పేరేపు అనే ఆ యువ ద‌ర్శ‌కుడు "క్ష‌ణం" త‌ర్వాత అడివి శేషుతో సంబంధం లేకుండా సొంతంగా ఎద‌గాల‌ని ప్ర‌య‌త్నించాడు. నిర్మాత సురేష్‌బాబుకి క‌థ చెప్పి ప్యాకేజ్ డీల్‌లో సినిమా మొద‌లుపెట్టాడు. అది కూడా థ్రిల్ల‌రే. ఐతే సురేష్‌బాబుకి, ఈ ద‌ర్శ‌కుడికి క్రియేటివ్ డిప‌రెన్సెస్ (అభిప్రాయ భేదాలు) వ‌చ్చాయ‌ట‌. సినిమా మొత్తం పూర్త‌య్యాక అదిపుడు అట‌కెక్కింద‌ని స‌మాచారం.

అలా ఈ యువ ద‌ర్శ‌కుడు మూడేళ్లు పాడుచేసుకున్నాడు.