మరో సీనియర్ హీరోయిన్ రీఎంట్రీ

Laila is making comeback!
Thursday, September 26, 2019 - 22:45

తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో 50కి పైగా సినిమాల్లో నటించిన లైలా రీఎంట్రీ ఇస్తోంది. దాదాపు 13 ఏళ్ల గ్యాప్ తర్వాత ఆమె మరోసారి తన కెరీర్ ను ప్రారంభిస్తున్నారు. ఇప్పటికే పలు యాడ్స్ లో నటిస్తున్న లైలా.. ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ రీఎంట్రీకి రెడీ అయ్యారు. ప్రస్తుతం ఓ ద్విభాషా చిత్రంలో నటిస్తున్న ఈ వెటరన్ బ్యూటీ, త్వరలోనే తెలుగు స్ట్రయిట్ మూవీలో కూడా నటించబోతోంది. ప్రస్తుతం టాలీవుడ్ మేకర్స్ తో చర్చలు జరుగుతున్నాయని, ఓ మంచి సినిమాతో తెలుగులో రీఎంట్రీ ఇస్తానని స్పష్టంచేసింది

తెలుగులో శ్రీకాంత్, వెంకటేశ్, బాలయ్య, వడ్డే నవీన్ లాంటి హీరోల సరసన నటించింది లైలా. 90ల చివర్లో ఆమె కుర్రకారును ఓ ఊపు ఊపింది. ఆ తర్వాత పెళ్లి చేసుకొని ముంబైలో సెటిల్ అయిపోయింది. స్రవంతి రవికిషోర్ ఆమెను తెలుగు తెరకు పరిచయం చేశాడు. సో.. ఇప్పుడు ఆయన బ్యానర్ లోనే రీఎంట్రీ ఇస్తే బాగుంటుందని అభిప్రాయపడింది లైలా.

ఇక బాలయ్య, వెంకీతో మరోసారి నటించడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని, హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో దిగుతూనే బాలయ్యతో ఫొటో కూడా దిగానని చెప్పుకొచ్చింది. అప్పటికీ ఇప్పటికీ బాలయ్య ఏమాత్రం మారలేదని, రియల్ ఐరన్ మేన్ గా ఉన్నారని అంటోంది లైలా. ఇప్పటికే చాలామంది సీనియర్లు రీఎంట్రీ ఇస్తున్నారు. విజయశాంతి కూడా మహేష్ బాబు సినిమాతో రీఎంట్రీ ఇస్తోంది. లైలా రీఎంట్రీ ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.