ల‌క్ష్మీ పార్వ‌తికి అంత ఎమౌంట్ ఇచ్చారా

Lakshmi Parvathi gets royalty
Monday, March 18, 2019 - 19:45

"లక్ష్మీస్ ఎన్టీఆర్" సినిమా విడుదల ఎపుడు అనేది మిస్టరీగా మారింది. ఈ వీకెండ్ విడుదల కావాల్సిన ఈ సినిమాకి ఇప్పటి వరకు సెన్సార్ పూర్తి కాలేదు. ఒకవేళ సెన్సార్ అయినా.. ఎపుడు విడుదల అవుతుందనేది చూడాలి.

మరోవైపు, లక్ష్మీ పార్వతి ఈ సినిమాకి సంబంధించి రావాల్సిన ఎమౌంట్‌ని ఇప్ప‌టికే తీసుకుందనేది టాక్. లక్ష్మీపార్వతి.. ఎన్టీరామారావు రెండో భార్య. ఎన్టీఆర్ జీవితంలోకి ఆమె ప్రవేశించిన తర్వాతే చంద్రబాబు నాయుడు ఎదురుతిరిగారు. ఎన్టీఆర్ నుంచి అధికారాన్ని బాబు లాగేసుకున్నారు. ఈ సినిమాలో అనేక సంఘటనలు, సీన్లు లక్ష్మీ పార్వతి చెప్పినవే. అందుకే రాయల్టీగా లక్ష్మీ పార్వతి కోటిన్నర రూపాయలు తీసుకున్నారని టాక్.

ఆమె పర్మిషన్ ఇస్తేనే సెన్సార్ బోర్డు క్లియ‌రెన్స్ ఇవ్వ‌గ‌ల‌దు. దాంతో ముందే ఆమెకి రాయ‌ల్టీని చెల్లించార‌ట‌. ఈ సినిమాపై వ‌ర్మ కూడా బాగానే వ్యాపారం చేసుకోనున్నాడు. ఎందుకంటే ఉచితంగా ప‌బ్లిసిటీ వ‌చ్చింది. ఎన్నిక‌ల సీజ‌న్ కావ‌డంతో బిజినెస్ బాగా జ‌రుగుతోంది. ఆ విధంగా వ‌ర్మ కూడా బాగానే క్యాష్ చేసుకుంటున్నాడు.