ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ బిజినెస్ ఉత్తిదేనా?

Lakshmi's NTR false business figures
Wednesday, March 27, 2019 - 17:45

వ‌ర్మ తీసిన "ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌"కి విప‌రీతంగా బిజినెస్ జ‌రిగిందని, వ‌ర్మ య‌మా లాభాల్లో ఉన్నార‌ని మీడియాలో ప్ర‌చారం జ‌రిగింది. ఐతే నిజంగా ఈ సినిమాకి భారీగా వ్యాపారం జ‌రిగిందా అని ఆరా తీస్తే కొన్ని ఆశ్చ‌ర్య‌క‌ర‌మైనే విష‌యాలు బ‌య‌ట‌పడ్డాయి. ఈ సినిమాని నైజాంలో అభిషేక్ పిక్చ‌ర్స్ రైట్స్ తీసుకొంది. అభిషేక్ పిక్చ‌ర్స్ కోసం ఏషియ‌న్ ఫిల్మ్స్ థియేట‌ర్ల‌లో విడుద‌ల చేస్తోంది.

ఇటు అభిషేక్‌, అటు ఏషియ‌న్ మ‌ధ్య మ‌నీ లావాదేవీలు లేవు. కేవ‌లం విడుద‌ల చేయ‌డ‌మే.  ఇంత‌కీ అభిషేక్ సంస్థ ఎంత‌కి కొనుగోలు చేసింది అని అడిగితే.. వ‌ర్మ తీసిన‌ "భైర‌వ‌గీత" సినిమాకి కాంపెన్సేట‌రీగా ఇది ఇచ్చార‌ట‌. "భైర‌వ‌గీత" అనే సినిమాని అభిషేక్ కొనుగోలు చేసింది. కానీ ఆ సినిమాతో ఆ సంస్థకి న‌ష్టాలే మిగిలాయి. దాంతో న‌ష్ట‌ప‌రిహారంగా వ‌ర్మ "ల‌క్ష్మీస్ ఎన్టీఆర్" తెలంగాణ హ‌క్కులు ఇచ్చాడ‌ట‌. మ‌రి ఇందులో బిజినెస్ ఎక్క‌డ జ‌రిగింది?

ఆంధ్రా, సీడెడ్‌లో కొన్ని జిల్లాల్లో వ్యాపారం జ‌రిగిన మాట వాస్త‌వ‌మే కానీ వ‌ర్మ ఓ రేంజ్‌లో లాభాల్లో ఉన్నాడ‌న్నంత సీన్ ఐతే లేదు.