లాస్య కూడా బిగ్‌బాస్‌కి దూర‌మే

Lasya not doing Bigg Boss 3
Wednesday, June 26, 2019 - 11:00

మేం బిగ్‌బాస్ సీజ‌న్ 3లో పార్టిసిపేట్ చేయ‌డం లేదు అంటూ ఒక్కో సెల‌బ్రిటీ బ‌య‌టికి వ‌చ్చి చెపుతున్నారు. ఇప్ప‌టికే గుత్తా జ్వాలా చేయ‌డం లేద‌ని చెప్పింది. గూఢ‌చారి హీరోయిన్ శోబిత కూడా అదే ట్వీట్ చేసింది. ఇపుడు ప్ర‌ముఖ యాంక‌ర్‌, బుల్లితెర న‌టి లాస్య కూడా ఒక వీడియో పోస్ట్ పెట్టింది.

బిగ్‌బాస్ సీజ‌న్ 3లో ఆఫ‌ర్ వ‌చ్చిన మాట నిజ‌మే కానీ తాను పాల్గొన‌డం లేద‌ని చెప్పింది. ఆమె ఇటీవ‌ల త‌ల్లి అయింది. మ‌రో ఏడాది పాటు ఇలాంటి షోల‌కి దూరంగా ఉంటాన‌ని క్లారిటీ ఇచ్చింది.

నాగార్జున హోస్ట్ చేసే సీజ‌న్ త్రీ వ‌చ్చే నెల మూడో వారంలో మొద‌లుకానుంది. త్వ‌ర‌లోనే నాగార్జున ప్రెస్‌మీట్ పెట్టి షో గురించి మాట్లాడ‌నున్నాడు. ఆ త‌ర్వాత కాంటెస్టెంట్‌ల పేర్ల విష‌యంలో క్లారిటీ రానుంది. యాంక‌ర్ శ్రీముఖి మాత్రం క‌న్‌ఫ‌మ్ అయింది.