అపుడే నేను అమ్మని కాలేను!

Laya rejects mother roles
Monday, February 18, 2019 - 22:30

ఓ ద‌శాబ్దం క్రితం హీరోయిన్‌గా వెలిగిన ల‌య ఇపుడు అమెరికాలో సెటిల్ అయింది. ఆమె భ‌ర్త ఎన్నారై. ల‌య హోమ్‌మేక‌ర్‌గా జీవనం సాగిస్తోంది. ఇటీవ‌ల ల‌య అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ సినిమాలో చిన్న పాత్ర పోషించింది. ఆ సినిమాని కూడా అమెరికాలోనే చిత్రీక‌రించారు. ల‌య గెస్ట్‌రోల్‌లాంటి పాత్ర‌లో ద‌ర్శ‌నమిచ్చింది. అలాగే ఆమె కూతురు కూడా ఈ సినిమాలో న‌టించింది. నిజ జీవితంలో ప‌దేళ్ల కూతురికి ఆమె త‌ల్లి. ఐతే సినిమా తెర‌పై అపుడే అమ్మ పాత్ర‌ల్లోకి రానంటోంది.

తిరిగి న‌టిగా బిజీ కావాల‌ని ఉంది కానీ అన్ని త‌ల్లి పాత్ర‌లే వ‌స్తున్నాయి. "ఇప్ప‌టి యువ హీరోల‌కి నేను త‌ల్లిగా సూట్ అవుతాన‌ని ద‌ర్శ‌కులు అనుకుంటున్నారు కానీ నేను అమ్మ‌గా న‌ప్పను. ఇంకా నాకు అంత వ‌య‌సు రాలేదు. అందుకే త్రివిక్ర‌మ్ అడిగినా నో చెప్పాను," అంటోంది ల‌య‌. 

2006లో ఆమె డాక్ట‌ర్ గ‌ణేష్‌ని పెళ్లాడి అమెరికాలో స్థిర‌ప‌డింది. వీరికిద్ద‌రు పిల్ల‌లు.