ముద్దులకొండ మ‌న విజ‌య్‌

Lip lock sentiment for Vijay Deverakonda
Thursday, February 28, 2019 - 23:15

ముద్దుసీన్ల‌ని తెలుగు సినిమాల్లో మెయిన్‌స్ట్రీమ్‌లోకి తీసుకొచ్చాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఆ సీన్లు వ‌స్తే ఇబ్బందిప‌డి పెద్ద‌వాళ్లు త‌ల‌తిప్పుకునే అవ‌స‌రం లేకుండా చేశాడు. ఆ రేంజ్‌లో పాపుల‌ర్ చేశాడు. ఇమ్రాన్ హ‌స్మీ రేంజ్‌లో ప‌చ్చి ముద్దు సీన్లు చేయ‌డం లేదు కానీ లిప్‌లాక్‌ల విష‌యంలో మాత్రం విజ‌య్ దేవ‌ర‌కొండ ఒక ట్రెండ్ సెట్ట‌ర్‌.

అర్జున్ రెడ్డి, నోటా, ట్యాక్సీవాలా, గీత‌గోవిందం.. ఆయ‌న న‌టించిన ఏ సినిమాలో లిప్‌లాక్ లేకుండా ఉంది చెప్పండి. కొన్ని సినిమాల్లో డోస్ ఎక్కువ‌, కొన్నింటిలో త‌క్కువ‌. కానీ ముద్దుముచ్చ‌టా మాత్రం కామ‌న్‌. గీత గోవిందం క‌థ‌కి అస‌లు కాన్‌ఫ్లిక్ట్ అంతా ముద్దే క‌దా. అది ఎంత హిట్ట‌యింది చెప్పండి. ఇది ఒక సెంటిమెంట్‌గా మారింది విజ‌య్‌కి. సినిమా ఇండ‌స్ట్రీలో సెంటిమెంట్స్‌కి విలువ ఎక్కువ‌. అందుకే డియ‌ర్ కామ్రేడ్ సినిమాలోనూ కొంత చుంభ‌న దృశ్యాలు మోతాదు ఎక్కువే అన్న టాక్ వినిపిస్తోంది. ఇది ఎంత‌వ‌ర‌కు నిజ‌మ‌న్న‌ది మూవీ విడుద‌లైతే కానీ తెలియ‌దు. 

విజ‌య్ దేవ‌ర‌కొండ‌.... మాడ్ర‌న్ హీరో. అత‌ను సినిమాల్లో ఇవి ఉండాల్సిందే.