నా ఆస్తంతా రాసిచ్చేస్తా

MAA controversy, Srikanth responds
Monday, September 3, 2018 - 13:15

మా అసోషియేష‌న్ వివాదం ముదిరింది. మా నిధుల‌న్నింటిని శివాజీ రాజా, శ్రీకాంత్ అండ్ టీమ్ మొత్తం తినేసింద‌ని మా  కొంద‌రు స‌భ్యులు ఆరోప‌ణ‌లు చేశారు. రెండు రోజుల పాటు సాగిన వివాదంత ఇపుడు మ‌రింత ముదిరింది.

మా అధ్య‌క్షుడు శివాజీరాజా ప్రెస్‌మీట్ పెట్టి మ‌రీ త‌న‌పై ఆరోప‌ణ‌లు చేసిన వారికి ఛాలెంజ్ విసిరాడు. నిధులు  దుర్వినియోగమైనట్లు నిరూపిస్త‌ నా ఆస్తంతా రాసిచ్చేస్తాన‌ని చెప్పాడు. అసోసియేషన్ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో కావాలనే కొందరు మాపై ఆరోపణలు చేస్తున్నారని అంటున్నాడు శివాజీరాజా.

మ‌రోవైపు, హీరో శ్రీకాంత్ కూడా అంతే ఘాటుగా మాట్లాడాడు. "అసోసియేషన్ లో నిధుల దుర్వినియోగం చేశారని నిరూపిస్తే శాశ్వతంగా అసోసియేషన్ నుంచి తప్పుకుంటా. నఅసోసియేషన్ అకౌంట్స్ అన్ని క్లియర్ గా ఉన్నాయి... నా మీద అలిగేషన్ చేసిన వాళ్ళు నిరూపించాలి..ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను," అని స‌వాల్ విసిరాడు శ్రీకాంత్‌.