మా ఎన్నిక‌లా? అసెంబ్లీ ఎన్నిక‌లా?

MAA Elections 2019
Sunday, March 10, 2019 - 11:45

అసెంబ్లీకో, పార్లమెంట్‌కో ఎన్నిక‌లు జ‌రిగితే ఎంత హ‌డావుడి జ‌రుగుతుందో, ఎంత మీడియా క‌వ‌రేజ్ వ‌స్తుందో అంత జ‌రిగింది "మా" ఎన్నిక‌లు సంద‌ర్భంగా. ఆదివారం నిర్వహించిన "మా ఎన్నిక‌లు 2019"కి టీవీ ఛానెల్స్‌లు గంట‌ల త‌ర‌బ‌డి లైవ్‌లు, క‌వరేజ్‌లు కూడా ఇచ్చాయి. "మా" ప్రెసిడెంట్ ఎవ‌రైతే జ‌నాల‌కి వ‌చ్చేది ఏంటి..అదేమైనా ప్ర‌జ‌ల‌కి ఉప‌యోగ‌ప‌డే ప‌ద‌వా? 

ఆ విష‌యాన్ని ప‌క్క‌న పెడితే... సాధార‌ణ రాజ‌కీయ ఎన్నిక‌ల్లాగే ఈ సారి "మా" ఎన్నిక‌ల్లోనూ డ‌బ్బు ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఎన్నిక‌ల్లో గెల‌వాల‌ని శివాజీరాజా ప్యానెల్ డ‌బ్బులు పంచింద‌ని ఆరోప‌ణ చేశాడు న‌టుడు న‌రేష్‌. వీరిద్ద‌రే ప్రెసిడెంట్ ప‌ద‌వికి పోటీ ప‌డ్డారు.

శివాజీరాజా మ‌రోసారి గెల‌వాలని అడ్డదారులు తొక్కాడ‌నీ, పేద క‌ళాకారులకి డ‌బ్బు ఆశ‌చూపి ఓటేశాడ‌ని ఆరోప‌ణ చేశాడు. ఈ ఆరోప‌ణ‌లు వింటుంటే.. వీరిద్ద‌రూ ఎమ్మెల్యేగా పోటీ ప‌డ్డారా అన్న అనుమానం రాక మాన‌దు. ఆ రేంజ్‌కి ఈ ఎన్నిక‌లను, మా ప‌దవుల‌ను దిగ‌జార్చారు శివాజీరాజా అండ్ న‌రేష్‌. ఇది అంత లాభ‌దాయ‌క ప‌ద‌వా అన్న‌ది మాకైతే తెలియ‌దు, "మా"కే తెలియాలి.

700పై చిలుకు స‌భ్యులున్న సంస్థ‌కి జ‌రిగిన ఎన్నిక‌లివి.