జీఎస్టీ రేట్ త‌గ్గడంతో మ‌హర్షికి రికార్డు!

Maharshi creates all-time third highest record in Nizam
Tuesday, May 28, 2019 - 00:15

మ‌హేష్‌బాబు న‌టించిన "మ‌హ‌ర్షి" సినిమా మూడో వారంలోనూ నైజాంలో మంచి వ‌సూళ్ల‌ను అందుకొంది. 19 రోజుల్లో ఈ సినిమా 28 కోట్లు కొల్ల‌గొట్టింది. నైజాంలో 28 కోట్ల రూపాయ‌ల షేర్ రావ‌డంతో...మ‌హ‌ర్షి ఆల్‌టైమ్ మూడో అతిపెద్ద హిట్‌గా ట్రేడ్ పండితులు అభివ‌ర్ణిస్తున్నారు.

మొన్న‌టి వ‌ర‌కు "రంగ‌స్థ‌లం" సినిమాకి ఈ రికార్డు ఉంది. 27.6 కోట్ల రూపాయ‌ల వ‌సూళ్ల‌తో "రంగ‌స్థ‌లం" నాన్‌-బాహుబ‌లి రికార్డును క‌లిగి ఉంది. ఐతే నైజాంలో 19 రోజుల్లోనే 28 కోట్ల రూపాయ‌ల‌ను కొల్లగొట్టి "మ‌హ‌ర్షి" ఆ రికార్డును సొంతం చేసుకొంది.

"రంగ‌స్థ‌లం" సినిమాతో పోల్చితే మ‌హ‌ర్షికి వ‌చ్చిన టోట‌ల్ గ్రాస్ త‌క్కువే ఇప్ప‌టి వ‌ర‌కు. ఐతే, రంగ‌స్థ‌లం సినిమా టైమ్‌లో జీఎస్టీ రేట్ 28 శాతం ఉంటే ఇపుడు 18 శాతం ఉంది. దాంతో మ‌హ‌ర్షికి షేర్ ఎక్కువ‌చ్చింది. అలా మ‌హ‌ర్షి త‌క్కువ టైమ్‌లోనే నైజాంలో ఈ రికార్డుని సాధించ‌గ‌లిగింద‌నేది విశ్లేష‌ణ‌. ఈ ఏరియాలో ఈ సినిమాని నిర్మాత దిల్‌రాజు డిస్ట్రిబ్యూట్ చేశాడు.

టాప్ నైజాం చిత్రాలు

బాహుబ‌లి 2 - రూ.68 కోట్లు
బాహుబ‌లి - రూ.43 కోట్లు
మ‌హ‌ర్షి - రూ.28 కోట్లు
రంగ‌స్థ‌లం - రూ.27.70 కోట్లు
అత్తారింటికి దారేది - రూ 23.50 కోట్లు
2.0 - రూ 23 కోట్లు