మొత్తానికి సెంచ‌రీ కొట్టాడు క‌దా

Maharshi crosses Rs 100 Cr
Monday, June 10, 2019 - 19:15

సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు న‌టించిన మ‌హ‌ర్షి సినిమా ఎట్ట‌కేల‌కి వంద కోట్ల రూపాయ‌ల మార్క్‌ని దాటింది. 5వ వారంలో ఈ మైలురాయిని చేరుకొంది. మ‌హేష్‌బాబుకిది తొలి వంద కోట్ల రూపాయ‌ల చిత్రం. విచిత్రం ఏమిటంటే ఈ సినిమాకి తొలి రోజు డివైడ్ టాక్ వ‌చ్చింది. న‌చ్చింద‌న్న‌వారు కూడా అంతంత‌మాత్రంగానే చెప్పారు కానీ గొప్ప‌గా చెప్ప‌లేదు. ఇక క్రిటిక్స్.... మ‌రో శ్రీమంతుడుకి కాపీ అన్నారు. 

ఐతే టాక్ ఎలా ఉన్నా ...చివ‌రికి ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద నిల‌బ‌డింది. నైజాంలో 30 కోట్ల రూపాయ‌ల మార్క్ దాట‌డం, వైజాగ్‌లో 10 కోట్ల‌పైనే షేర్ రావ‌డంతో ఈ సినిమా 100 కోట్ల రూపాయ‌ల క్ల‌బులో చేరింది. బాహుబ‌లి 2, బాహుబ‌లి, రంగ‌స్థ‌లం, మ‌హ‌ర్షి, ఖైదీ నెంబ‌ర్ 150... ఇవే రూ.100 కోట్లు ఆపైన వ‌సూళ్లు సాధించిన చిత్రాలు. ఆ లిస్ట్‌లోకి మిక్స్‌డ్‌టాక్‌తో విడుద‌లైన మూవీ చేర‌డం విశేషం. 

 అందుకే సెల‌బ్రేటింగ్ మ‌హ‌ర్షి అంటూ ఇప్ప‌టికీ ఆనందంగా ట్వీట్ చేస్తున్నాడు మ‌హేష్‌బాబు. ఈ హ్య‌పీ మూడ్‌లోనే వంశీకి మ‌రో సినిమా ఆఫ‌ర్ ఇచ్చాడ‌ట‌