ఇక మ‌హ‌ర్షిది చ‌లో దుబాయ్!

Maharshi to head Dubai for songs
Tuesday, March 12, 2019 - 23:45

మ‌హేష్‌బాబు న‌టిస్తున్న "మ‌హ‌ర్షి" సినిమా షూటింగ్ తుది ద‌శ‌కి చేరుకొంది. ఈ సినిమాకి సంబంధించిన చిన్న ఎపిసోడ్‌ని ఇటీవ‌ల చెన్నై, మ‌హాబ‌లిపురంల‌లో చిత్రీక‌రించారు. చెన్నై షూటింగ్ పూర్తి అయింద‌ని మ‌హేష్‌బాబు భార్య న‌మ‌త్ర సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు.

షూటింగ్ పూర్త‌యిన త‌ర్వాత మ‌హేష్‌బాబు కూతురు, కొడుకు, ద‌ర్శ‌కుడు వంశీ పైడిప‌ల్లి కూతురు.. సంగీత ద‌ర్శ‌కుడు దేవీశ్రీప్ర‌సాద్‌తో దిగిన ఫోటోల‌ను ఆమె షేర్ చేశారు. 

మ‌హ‌ర్షి టీమ్ ఇక దుబాయ్‌కి వెళ్ల‌నుంది. అక్క‌డ రెండు పాట‌ల‌ను చిత్రీక‌రిస్తారు. పాట‌ల చిత్రీక‌ర‌ణ‌తో సినిమా షూటింగ్ పూర్త‌వుతుంది. మే 9న విడుద‌ల కానుంది మ‌హ‌ర్షి. మ‌హేష్‌బాబు, వంశీ పైడిప‌ల్లి కాంబినేష‌న్లో రూపొందుతోన్న తొలి మూవీ ఇది. మ‌హేష్‌బాబు కెరియ‌ర్‌లో ఇది 25వ చిత్రం.

దిల్‌రాజు, పీవీపీ, అశ్వ‌నీద‌త్ నిర్మిస్తున్న ఈ మూవీకి దేవీశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నాడు.