విజ‌య‌వాడ‌లో విజ‌యోత్స‌వం

Maharshi success event in Vijayawada
Wednesday, May 15, 2019 - 22:15

సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు కెరియ‌ర్‌లో 25వ చిత్రంగా విడుద‌లైన మ‌హ‌ర్షి తొలి వారం అద‌ర‌గొట్టింది. మొద‌టి వారం ప్ర‌పంచ‌వ్యాప్తంగా 70 కోట్ల రూపాయ‌ల‌పైనే (షేర్‌) వ‌సూళ్లు అందుకొంది. మ‌హేష్‌బాబు కెరియ‌ర్‌లో ఫ‌స్ట్ వీక్ హ‌య్యెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన మూవీ ఇది.  ఇంత పెద్ద భారీ విజ‌యం సాధించడంతో అభిమానుల‌కి థ్యాంక్స్ చెప్పేందుకు బుధవారం (మే 15)నాడు సుద‌ర్శ‌న్ 35 ఎం.ఎం థియేట‌ర్‌కి వెళ్లి వారిని ప‌ల‌క‌రించాడు. అదే వేదికపై ఈ సినిమా విజ‌యోత్స‌వ వేడుక‌ల తేదీని ప్ర‌క‌టించాడు. విజ‌య‌వాడ‌లో ఈ నెల 18న పెద్ద ఎత్తున స‌క్సెస్ ఈవెంట్‌ని నిర్వ‌హించ‌నున్నారు.

ఒక్క‌డు సినిమా స‌హా త‌న కెరియ‌ర్‌లో పెద్ద హిట్స్‌కి సంబంధించిన విజ‌యోత్స‌వ వేడుక‌ల‌ను విజ‌య‌వాడ‌లో నిర్వ‌హించ‌డం మ‌హేష్‌బాబుకి ఇష్టం. ఇది ల్యాండ్‌మార్క్  మూవీ కాబ‌ట్టి ఈ సినిమా స‌క్సెస్ ఈవెంట్‌ని కూడా మే 18 సాయంత్రం బెజ‌వాడ‌లో నిర్వ‌హించ‌నున్నారు. ఈ సినిమాకి ముగ్గురు నిర్మాత‌లు. అందులో ఇద్ద‌రు (అశ్వ‌నీద‌త్‌, పీవీపీ) విజ‌య‌వాడ ప్రాంతానికి చెందిన వారే.