మహర్షి ఐదో పాట "పాల పిట్ట"

Maharshi's fifth song is a folk song Pala Pitta
Saturday, April 27, 2019 - 19:30

సూపర్‌స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతోన్న భారీ చిత్రం ‘మహర్షి’.  ఈ సినిమాకి సంబంధించిన నాలుగు పాట‌లు ఇప్ప‌టికే వ‌చ్చాయి. ఐదో పాట ఏప్రిల్ 29న విడుద‌ల కానుంది. ఈ ఐదో పాట ...ప‌క్కా మాస్ గీత‌మ‌ట‌. ఈ ఐదో పాట అయిన ‘పాలపిట్ట..’ను ఏప్రిల్ 29 ఉదయం 9.09 గంటలకు విడుదల చేయబోతున్నారు. 

దేవీశ్రీప్ర‌సాద్ స్వ‌ర‌ప‌ర్చిన ఈ ఆల్బ‌మ్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు రెండు పాట‌లే కాస్త క్లిక్ అయ్యాయి. ఈ మాస్ గీతం అంద‌ర్నీ అల‌రిస్తుందంటున్నారు.

మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. అల్లరి నరేష్ కీలక పాత్రలో నటిస్తున్నారు.  మే 9న వరల్డ్‌వైడ్‌గా విడుదల కానుంది మ‌హ‌ర్షి. మ‌రోవైపు,  ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ను మే 1న నెక్లెస్‌రోడ్‌లోని పీపుల్స్ ప్లాజాలో గ్రాండ్‌గా నిర్వహించనున్నారు.