బ్యూటీతో మ‌హ‌త్‌ ఎంగేజ్‌మెంట్‌

Mahat Raghavendra gets engaged to Prachi Mishra
Wednesday, April 17, 2019 - 21:45

మ‌హ‌త్ రాఘ‌వేంద్ర గుర్తున్నాడా? ఆరేడేళ్ల క్రితం అత‌ని పేరు మార్మోగింది. తాప్సీతో ప్రేమాణం కార‌ణంగా వార్త‌ల్లోకెక్కాడు ఈ త‌మిళ కుర్ర హీరో. తెలుగులోనూ బ్యాక్‌బెంచ్ స్టూడెంట్‌, ర‌న్‌, లేడీస్ అండ్ జెంటిల్మెన్ వంటి చిత్రాలు చేసిన మ‌హ‌త్ రాఘ‌వేంద్ర ఇపుడు పెళ్లి చేసుకుంటున్నాడు. 

మాజీ మిస్ ఇండియా ప్రాచి మిశ్రాతో అత‌ని ఎంగేజ్‌మెంట్ జ‌రిగింది. నిశ్చితార్థం జ‌రిగింద‌ని త‌నే ఫోటోని షేర్ చేశాడు. మ‌హ‌త్ రాఘ‌వేంద్ర తాప్సీతో చాలా కాలం డేటింగ్ చేశాడు కానీ వారి బ్రేక‌ప్ అయి కూడా చాలా కాల‌మే అవుతోంది. ఇటీవ‌ల మ‌హ‌త్ త‌మిళంలో సైడ్ రోల్స్‌లో ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాడు.