సీఎంకీ, మ‌హేష్‌కి పెరిగిన గ్యాప్‌?

Mahesh Babu distancing himself from Y S Jagan Mohan Reddy?
Monday, July 1, 2019 - 15:15

సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు ఆంద్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వై.ఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి దూరంగా జ‌రుగుతున్నాడా? ఒక‌పుడు జ‌గ‌న్‌తో మంచి ఫ్రెండ్సిప్ మెయిన్‌టెయిన్ చేసిన మ‌హేష్‌బాబు ఇపుడు ఆయ‌న‌కి దూర‌మ‌య్యాడా? సోష‌ల్ మీడియాలో ఈ విష‌యంలో తెగ ర‌చ్చ జ‌రుగుతోంది.

ఇటీవ‌ల మ‌హేష్‌బాబు పిన్ని విజ‌య నిర్మ‌ల చ‌నిపోయిన‌పుడు...ఆమె భౌతిక‌కాయానికి నివాళి అర్పించేందుకు జ‌గ‌న్ ప్ర‌త్యేకంగా విజ‌య‌వాడ నుంచి హైద‌రాబాద్‌కి వ‌చ్చారు. కానీ ఆ స‌మ‌యంలో మ‌హేష్‌బాబు త‌న తండ్రి కృష్ణ ఇంటికి దూరంగా ఉన్నారు. వై.ఎస్‌.జ‌గ‌న్ వ‌స్తున్నాడ‌ని ముంద‌స్తు స‌మాచారం ఉన్నా... మ‌హేష్‌బాబు ఆ టైమ్‌కి అక్క‌డికి చేరుకోలేదు. ఐతే తాజాగా ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు, ఆయ‌న బావ‌మరిది నంద‌మూరి బాల‌కృష్ణ‌...పరామ‌ర్శ‌కి వ‌చ్చిన‌పుడు ఠ‌కీమ‌ని మ‌హేష్‌బాబు విచ్చేశాడు.

ఈ రెండింటిని లింక్ చేస్తూ వైఎస్సార్సీ అభిమానులు మ‌హేష్‌బాబుని విమ‌ర్శిస్తున్నారు. మ‌హేష్‌బాబుకి, ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కి దివంగ‌త ముఖ్య‌మంత్రి వై.ఎస్‌.రాజ‌శేఖ‌ర్ రెడ్డి కుటుంబం ఎంతో చేసిందనీ, కానీ మ‌హేష్‌బాబు ఒక రాష్ట్ర ముఖ్య‌మంత్రి త‌న తండ్రి ఇంటికి వ‌చ్చిన‌పుడు లేకుండా జారుకున్నాడ‌ని కామెంట్ చేస్తున్నారు.

ఐతే జ‌గ‌న్ ఈ ఎన్నిక‌ల్లో గెలిచిన‌పుడు కంగ్రాట్స్ చెప్పాడు మ‌హేష్‌బాబు. ప్ర‌త్యేకంగా ట్వీట్ చేశాడు.