దుబాయ్ నుంచి వ‌చ్చాకే క‌థ ఫైన‌ల్‌

Mahesh Babu holidaying in Dubai
Tuesday, January 1, 2019 - 22:30

సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు ప్ర‌స్తుతం దుబాయ్‌లో ఉన్నాడు. భార్యాపిల్ల‌లు, కొంద‌రు స్నేహితుల‌తో క‌లిసి కొత్త ఏడాది సంబ‌రాలు జ‌రుపుకుంటున్నాడు. మ‌హేష్‌బాబు ఇటీవ‌ల త‌రుచుగా విదేశాల‌కి వెళ్లి సేద దీరుతున్నాడు. గతేడాది నాలుగు, అయిదు సార్లు ఫ్యామిలీతో ఫారిన్ హాలీడే ట్రిప్పులేశాడు. 2019 వేడుక‌ల‌ను దుబాయ్‌లో జ‌రుపుకుంటున్నాడిపుడు. దుబాయ్ నుంచి తిరిగి వ‌చ్చిన త‌ర్వాతే సుకుమార్ రెడీ చేస్తున్న ఫైన‌ల్ స్క్రిప్ట్ నేరేష‌న్ వింటాడ‌ట‌.

సుకుమార్ ఇప్ప‌టికే రెండు క‌థలు చెప్పాడు. అందులో మొద‌టి క‌థ‌ని నిర్ద్వందంగా తిర‌స్క‌రించాడు. రీసెంట్‌గా చెప్పిన లైన్‌ని డెవ‌ల‌ప్ చేసేందుకు సుకుమార్ బ్యాంకాక్ వెళ్లాడు. అక్క‌డ ఒక రిసార్ట్‌లో త‌న ర‌చ‌యిత‌ల టీమ్‌తో క‌లిసి ఫైన‌ల్ స్ర్కిప్ట్ పూర్తి చేశాడు. ఇపుడు ఫుల్ నేరేష‌న్ ఇస్తాడు. దాన్ని బ‌ట్టి మ‌హేష్‌బాబు ఓ నిర్ణ‌యం తీసుకుంటాడు.

సుకుమార్ చెప్పిన ఈ ఫైన‌ల్ నేరేష‌న్ న‌చ్చితే సినిమా వెంట‌నే పూజా కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది. లేదంటే ఈ సినిమా సెట్‌కి వెళ్ల‌డం మ‌రింత ఆల‌స్యం అవుతుంది. మ‌రోవైపు, మ‌హేష్‌బాబు హీరోగా వంశీ పైడిప‌ల్లి తీస్తున్న మ‌హ‌ర్షి కొత్త షెడ్యూల్ సంక్రాంతి త‌ర్వాత ప్రారంభం కానుంది.