ఇంటికొచ్చిన మ‌హేష్‌బాబు

Mahesh Babu returns from Pollacchi schedule of Maharshi
Monday, January 28, 2019 - 22:45

ఏంటి హెడ్‌లైన్‌ని చూసి క‌న్ఫ్యూజ్ అవుతున్నారా? ఏమి లేదండి. న‌మ్ర‌త అలా ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌డేట్ చేశారు. త‌న భ‌ర్త ఇంటికి వ‌చ్చాడ‌ని...హి ఈజ్ బ్యాక్‌...హోమ్ అని ఆనందంగా పోస్ట్ చేశారు. ఇంత‌కీ ఆయ‌న ఎక్క‌డి నుంచి వచ్చాడంట‌? వెల్‌... మ‌హేష్‌బాబు పొల్లాచ్చి నుంచి తిరిగి హైద‌రాబాద్ వ‌చ్చార‌న్న‌మాట‌.

మ‌హేష్‌బాబు అండ్ టీమ్ పొల్లాచ్చి షెడ్యూల్‌ని పూర్తి చేసుకొని వ‌చ్చింది. "మ‌హ‌ర్షి" సినిమా కోసం గ‌త ప‌దిహేను రోజుల పాటు పొల్లాచ్చిలో కొన్ని కీల‌క స‌న్నివేశాల‌ను తీశాడు ద‌ర్శ‌కుడు వంశీ పైడిప‌ల్లి. క‌థ ప్ర‌కారం గ్రామీణ ప్రాంతానికి చెందిన కొన్ని సీన్ల‌ను అక్క‌డి తీశారు. సెకండాఫ్‌లో వ‌చ్చే సీన్ల కోసం రామోజీ ఫిల్మ్‌సిటీలో ఏకంగా ఒక ఊరి సెట్‌నే వేశారు. 

దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ మూవీ షెడ్యూల్ పొల్లాచ్చిలో పూర్తి కావ‌డంతో మ‌హేష్‌బాబు ప‌క్షం రోజుల త‌ర్వాత ఇంటికొచ్చాడు. ఆ ఆనందంలో న‌మ్ర‌త అలా పోస్ట్‌చేశార‌న్న‌మాట‌. "మ‌హ‌ర్షి" సినిమాని ఏప్రిల్ 25న విడుద‌ల చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ద‌ర్శ‌కుడు వంశీ పైడిప‌ల్లి ఈ సినిమాని చాలా లావిష్‌గా తీస్తున్నాడు. ఇది మ‌హేష్‌బాబుకి 26వ చిత్రం.